అంతర్జాతీయం

భారీ వర్షాలతో బంగ్లాదేశ్ ఉక్కిరి బిక్కిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, జూన్ 13: భారీ వర్షాలు, వరదలతో బంగ్లాదేశ్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన ఆ దేశ ఉత్తర ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడి దాదాపు 90 మంది మృతిచెందారు. వీరిలో ఇద్దరు సైనిక అధికారులు కూడా ఉన్నారని, మట్టిపెళ్లల కింద ఇంకా ఎంతోమంది చిక్కుకుని ఉన్నందున మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు మంగళవారం వెల్లడించారు. పర్వత ప్రాంతమైన రంగమతి జిల్లాలో ఎక్కువ ప్రాణనష్టం సంభవించిందని, అక్కడ కొండ చరియలు విరిగిపడటంతో ఇద్దరు సైనిక అధికారులుసహా 36 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. ‘ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం మృతుల్లో ఇద్దరు సైనికాధికారులు ఉన్నారని, పలువురు సైనికులు గాయపడ్డారని తెలుస్తోంది. ఇంతకుమించి మేము ఏమీ ధ్రువీకరించలేము’ అని ఢాకాలో బంగ్లాదేశ్ సైనికదళ అధికార ప్రతినిధి ఒకరు పిటిఐ వార్తా సంస్థతో అన్నారు. భారీ వర్షాల వలన సోమవారం రాత్రి కొండ చరియలు విరిగిపడటంతో రంగమతికి, దేశ రాజధాని ఢాకాకు మధ్య రోడ్డు మార్గం మూసుకుపోయిందని, ఆ రోడ్డుపై మట్టిపెళ్లలను తొలగించేందుకు వెళ్లిన సైనిక సిబ్బందిపై తాజాగా మరోసారి కొండ చరియలు విరిగి పడ్డాయని, ఈ ఘటనలో కనీసం ఇద్దరు సైనిక అధికారులు మృతిచెందినట్లు ఇప్పటివరకూ అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. కాగా, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వలన కొండ చరియలు విరిగిపడి రంగమతిసహా బందర్బన్, చిట్టగాంగ్ జిల్లాల్లో దాదాపు 90 మంది మృతిచెందారని ‘్ఢకా ట్రిబ్యూన్’ పత్రిక వెల్లడించింది. చిట్టగాంగ్‌లోని రంగూనియా, చందనైష్ ఉప జిల్లాల్లో కనీసం 11 మంది, బందర్బన్ జిల్లాలో ఆరుగురు మృతిచెందగా, మరో ఐదుగురు గాయపడ్డారని ఆ పత్రిక పేర్కొంది. బాధిత ప్రాంతాల్లో మట్టిపెళ్లల కింద ఇంకా ఎంతోమంది చిక్కుకుని ఉన్నారని, వీరిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బందికితోడుగా సైనిక బలగాలను కూడా రంగంలోకి దింపడం జరిగిందని అధికారులు తెలిపారు.

చిత్రం.. కొండ చరియలు విరిగిపడిన బందర్బన్ ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది