అంతర్జాతీయం

లండన్ టవర్‌లో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 14: పశ్చిమ లండన్‌లోని 24 అంతస్తుల ‘గ్రీన్‌ఫెల్ టవర్’లో బుధవారం సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. 50 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అందోళన చెందుతున్నారు. లాంచెస్టర్ వెస్ట్ ఎస్టేట్‌లోని లాటిమెర్ రోడ్డులో ఈ బహుళ అంతస్తు భవనం ఉంది. స్థానిక కాలమానం ప్రకారం 01:16 గంటలకు టవర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. రెండో అంతస్తు నుంచి పై అంతస్తుల వరకూ మంటలు వ్యాపించాయి. టవర్‌లో మొత్తం 120 ఫ్లాట్లు ఉండగా, 600 మంది నివసిస్తున్నారు.‘ప్రాధమిక సమాచారం మేరకు ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. భవనంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది’అని మెట్రోపాలిటన్ పోలీసు కమిషనర్ స్టువర్ట్ కండే వెల్లడించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రమాదం వార్త క్షణాల్లోనే తెలిసిందని బిబిసి వార్తా సంస్థ తెలిపింది. 24 అంతస్తుల గ్రీన్‌ఫెల్ టవర్ మంటలకు ఆహుతై ఏక్షణాన్నైనా కూలిపోయే స్థితిలో ఉంది. సుమారు 250 మంది అగ్నిమాపక సిబ్బంది సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. అగ్నిప్రమాదంపై లండన్ మేయర్ సాదిఖ్ ఖాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహా య కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయని ఆయన ప్రకటించారు. కాగా తమను రక్షించాలంటూ భవనంలో ఉంటున్న వారు హాహాకారుల చేశారని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. తమ పిల్లలను కాపాలంటూ వేడుకున్నారని అన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న బాధితులు కొందరు బెట్‌షీట్ల సహాయంతో టవర్ బ్లాక్‌కు వెళ్లి ప్రాణాలు రక్షించుకున్నారు.‘ఇది అత్యంత దురదృష్టకర సంఘటన. 29 ఏళ్ల నా సర్వీసులో ఇంతటి ఘోర అగ్నిప్రమాదాన్ని చూడలేదు’అని లండన్ అగ్నిమాపక శాఖ అధిపతి డానీ కాటన్ అన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని ఆయన స్పష్టం చేశారు. గాయపడ్డ 50 మందికి వైద్య చికిత్స అందించినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇలా ఉండగా గ్రీన్‌ఫెల్ టవర్‌లో అనేక మంది ముస్లిం కుటుంబాలు ఉంటున్నాయి. రంజాన్ మాసం కావడంతో ప్రమాదం సమయంలో ఎక్కువ మంది మెలకువగానే ఉన్నారు. క్షతగాత్రులను రూబే పోర్టోబెల్లో కమ్యూనిటీ సెంటర్‌కు తరలించారు.

పశ్చిమ లండన్‌లోని 24 అంతస్తుల ‘గ్రీన్‌ఫెల్ టవర్’లో చెలరేగుతున్న మంటలు