అంతర్జాతీయం

గ్వాటెమాలలో కంపించిన భూమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్వాటెమాల, జూన్ 14: పశ్చిమ గ్వాటెమాలలోని మెక్సికో సరిహద్దులో తీవ్ర భూకంపం సంభవించింది. అనేక నగరాలకు భూ ప్రకంపనలు వ్యాపించాయి. భూకంప తీవ్రత రిక్టార్ స్కేలుపై 6.6గా నమోదైంది. ఒక వ్యక్తి గాయపడినట్టు సమాచారం అందిందని అధికారులు వెల్లడించారు. ఎలాంటి సునామీ హెచ్చరికలూ జారీ చేయలేదన్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 1:29కి భూమి కంపించిందని సాన్‌మార్కోస్‌లోని భూకంప పరిశోధన కేంద్రం తెలిపింది. అనేక నగరాల్లో ప్రకంపనలు వచ్చాయి. సాన్ సెబాస్టియన్‌లోని ఓ పురాతన చర్చి కూలిపోయి ఒక వ్యక్తి గాయపడ్డారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సింది లేదని దేశాధ్యక్షుడు జిమీ మోరాలెస్ విజ్ఞప్తి చేశారు.