అంతర్జాతీయం

భారత సరిహద్దుల్లో మరిన్ని చైనా బలగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 14: చైనా తన రక్షణ సామర్థ్యాన్ని పెంచుకుందని, భారత సరిహద్దుల్లో మరిన్ని సైనిక బలగాలను మోహరించిందని అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ తెలిపింది. చైనా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో గల తన సైనిక స్థావరాల్లో ప్రత్యేకించి పాకిస్తాన్‌లో సైనిక బలగాలను పెంచుతోందని అమెరికా హెచ్చరించింది. భారత సరిహద్దులకు దగ్గరలో చైనా తన సైనిక బలగాలను పెంచినట్లు తాము గమనించామని అమెరికా రక్షణ శాఖ ఉప సహాయ మంత్రి (తూర్పు ఆసియా) అబ్రహాం ఎం డెన్మార్క్ వెల్లడించారు. చైనా సైనిక, భద్రతా బలగాలకు సంబంధించిన పరిణామాలపై అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ రూపొందించిన వార్షిక నివేదికను అమెరికా కాంగ్రెస్‌కు సమర్పించిన అనంతరం డెన్మార్క్ ఇక్కడ నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. అయితే చైనా ఏ ఉద్దేశంతో తన రక్షణ పాటవాన్ని, సైనిక బలగాల మోహరింపును పెంచుకుంటోందో అనే విషయంలో ఒక నిర్ధారణకు రావడం కష్టమని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.