అంతర్జాతీయం

ఏ తప్పూ చేయలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూన్ 15: పనామా పేపర్స్ లీక్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ గురువారం ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సంయుక్త దర్యాప్తు బృందం ఎదుట హాజరయ్యారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికయిన తన ప్రభుత్వంపై కొంతమంది అజ్ఞాత శత్రువులు కుట్రలు పన్నుతున్నారని షరీఫ్ అన్నారు. పదవిలో ఉన్న ఒక పాకిస్తాన్ ప్రధానమంత్రి ఒక దర్యాప్తు కమిటీ ఎదుట హాజరు కావడం ఇదే మొదటిసారి. ప్రధానమంత్రిగా తన పదవీ కాలంలో జరిగిన వాటితో ఈ ఆరోపణలకు ఎలాంటి సంబంధం లేదని, తన కుటుంబ వ్యాపారాలకు సంబంధించి తనపైన, తన కుటుంబ సభ్యులపైన వచ్చిన వ్యక్తిగత ఆరోపణలు మాత్రమేనని దాదాపు మూడు గంటల విచారణ అనంతరం విలేఖరులతో షరీఫ్ చెప్పారు. మాజీ ప్రధానిగా, ఇప్పుడు మూడోసారి ప్రధానమంత్రిగా తాను లక్షలాది కోట్ల రూపాయల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపానని, అయితే తాను తప్పు చేసినట్లు ప్రత్యర్థులు ఎలాంటి ఆరోపణలు చేయలేకపోయారని ఆయన అన్నారు.