అంతర్జాతీయం

రెండు నౌకలు ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యొకోసుకా, జూన్ 17: జపాన్‌లోని పసిఫిక్ కోస్ట్‌లో యుఎస్ ఫిడ్జ్‌గెరాల్డ్ నౌక, ఫిలిప్పీన్స్‌కు చెం దిన కంటైనర్ షిప్పు ఢీకొన్న ప్రమాదంలో అమెరికాకు చెందిన ఏడుగురు నావీ సిబ్బంది ఆచూకీ తెలియకుండా పోయింది. ఒక కమాండర్ గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. మిలటరీ నౌక, కంటైనర్ షిప్పు ఢీకొన్నాయని వారన్నారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే విమానాలు, బోట్లను రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదం తరువాత నావీ సిబ్బంది ఆచూకీ తెలియకుండా పోయింది. పలువురు నౌకా సిబ్బం ది గాయపడ్డారని తెలిసింది.
క్షతగాత్రులను హెలికాప్టర్లలో ఆసుపత్రులకు తరలించారు. కమాండెంట్ అధికారి బ్రైసే బెన్‌సన్ గాయపడ్డారు. ఫిడ్జ్‌గెరాల్డ్ మిలటరీ నౌక నుంచి ఓ ఉద్యోగిని స్ట్రెచర్‌పై తరలిస్తున్న దృశ్యం టీవీలో ప్రసారమైంది. హెలీకాప్టర్ ద్వారా క్షతగాత్రులను తరలించారు. ‘మిలటరీ నౌక, కంటైనర్ షిప్పు ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు గల్లంతయ్యారు. జపాన్ కోస్ట్‌గార్డ్ ముమ్మరంగా గాలిస్తోంది’ అని నావీ ప్రకటించింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 2.30 గంట ల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. టోక్యోకు నైరుతిగా ఇజు పెనిన్‌సులా తీరంలో రవా ణా నౌకలతో నిత్యం రద్దీగా ఉంటుంది. యొ కోహమా, టోక్యో సరుకుల రవాణాకు ప్రధాన రేవులుగా ఉన్నాయి. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని, ఇప్పటివరకూ ఆచూకీ తెలియలేదని జపాన్ కోస్ట్‌గార్డ్ అధికారి యుతాకా సైటో వెల్లడించారు.

చిత్రం.. మిలటరీ నౌక, కంటైనర్ షిప్పు ఢీకొన్న దృశ్యం