అంతర్జాతీయం

పోర్చుగల్‌లో దావానలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లిస్బన్, జూన్ 18:మధ్య పోర్చుగల్‌లో అడవుల్లో శనివారం రాత్రి నుంచి రగులుకున్న మంటల్లో 62మంది సజీవ దహనమయ్యారు. ప్రతి వేసవిలోనూ ఈ అట్లాంటిక్ తీర ప్రాంత దేశంలోని అడవుల్లో మంటలు సహజమే. అయితే ఇంత భీకర స్థాయిలో గతంలో ఎప్పుడూ మంటలు వ్యాపించ లేదని, ఇంత మంది మరణించడమూ జరుగలేదని ప్రధాని ఆంటోనియో కోస్టా అన్నారు. ఈ మంటలు మరింతగా వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్న ఆయన మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు. మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించిన పోర్చుగల్ ప్రభుత్వం తక్షణ సహాయ చర్యలు చేపట్టేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపింది. మంటలను ఆర్పే విమానాలను అందించేందుకు ఐరోపా యూనియన్ ముందుకొచ్చింది. ఇప్పటికే ఫ్రాన్స్ మూడు విమానాలను, స్పెయిన్ రెండు విమానాలను పోర్చగల్‌కు తరలించింది.