అంతర్జాతీయం

ద్వైపాక్షక బంధంలో మరోమెట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, జూన్ 18: భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఈ నెల 26న జరగబోయే శిఖరాగ్ర భేటీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను కొత్త పుంతలను తొక్కించగలదన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. హెచ్1బి వీసాలుసహా అనేక అంశాలపై ఇరు దేశాల మధ్య సమస్యలు తలెత్తిన నేపథ్యంలో ఈ శిఖరాగ్ర భేటీకి మరింత ప్రాధాన్యత చేకూరిందని నిపుణులు భావిస్తున్నారు. కచ్చితంగా ఈ సమావేశం భారత్ అమెరికాల మధ్య స్నేహ సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడం తథ్యమని భారత్ ఆసియా వ్యవహారాల నిపుణుడు మార్షల్ బౌటన్ పేర్కొన్నారు. ఈ సమావేశం సందర్భంగా పరస్పరం అర్థం చేసుకోవడానికి అభిప్రాయాలు తెలుసుకోవడానికి మోదీ, ట్రంప్‌లకు ఒక బలమైన అవకాశం దక్కినట్లు అవుతుందని ఆయన తెలిపారు. అదే విధంగా ప్రాంతీయంగానూ, ద్వైపాక్షికంగానూ, అంతర్జాతీయంగానూ కూడా కలిసికట్టుగా ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న అంశాలను కూడా వీరు నిర్ధారించుకునేందుకు వీలు కలుగుతుందని తెలిపారు. అయితే ఈ సమావేశంలోనే ఏదో అద్భుతం జరిగిపోతుందని ఆశించడానికి వీలులేదని తదుపరి ఎలాంటి సమస్యలకు ఆస్కారం లేకుండా సజావుగా ఇరు దేశాలు ముందుకు సాగడానికి ఇదే ప్రాతిపదిక అవుతుందని ఆయన తెలిపారు. ఏ విధంగానూ అద్భుతమైన ప్రకటనలేవీ ఈ సమావేశానంతరం వెలువడే అవకాశం కూడా లేదని తెలిపారు. ముఖ్యంగా పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఇరు దేశాలు దృష్టిపెట్టాలని, అలాగే భద్రత, ఉగ్రవాదం తదితర సవాళ్లపైనా ఏ విధంగా ముందుకు వెళ్లాలన్నదానిపై స్పష్టమైన వ్యూహరచన చేసుకోవాలని ఆయన సూచించారు. రానున్న రెండు మూడు దశాబ్దాల్లో భారత్, అమెరికా మైత్రీ బంధాన్ని మరింతగా పెంపొందించే విధంగా ఈ సమావేశాన్ని మోదీ, ట్రంప్ వినియోగించుకుంటే ఉభయతారకంగా ఉంటుందని తెలిపారు. పాకిస్తాన్ ఉగ్రవాద ధోరణి గురించి ట్రంప్ ముందు మోదీ ప్రస్తావించే అవకాశాలున్నాయని, అలాగే తమ మధ్య ఉన్న ద్వైపాక్షిక సమస్యలను కూడా మోదీ ఈ సందర్భంగా ట్రంప్ దృష్టికి తేవచ్చునని తెలిపారు. అలాగే అఫ్గాన్ విషయంలో ట్రంప్ ప్రభుత్వం అనుసరించే వైఖరి ఏమిటన్న విషయాన్ని కూడా మోదీ కచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని బౌటన్ తెలిపారు.