అంతర్జాతీయం

యోగ దినోత్సవానికి సర్వంసిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, జూన్ 19: మూడో అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించటానికి ప్రపంచ దేశాలు అన్నీ సంసిద్ధమయ్యాయి. ప్రధాన వేదిక అయిన ఐక్యరాజ్యసమితి ముఖ్య కార్యాలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ఈ లైట్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటం తనకు ఎంతో గౌరవమని అనుపమ్ ఖేర్ వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితి గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ కాంతులతో విరాజిల్లుతోందని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. యోగ దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. న్యూయార్క్ నగరంలో భారత రాయబార కార్యాలయం ‘రీచార్జ్ ఎట్ బ్యాటరీ పార్క్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఐక్యరాజ్యసమితి ముఖ్యకార్యాలయంలో యోగ మాస్టర్లతో యోగ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. స్వామి చిదానంద సరస్వతి, సాధ్వి భగవతి సరస్వతి (పరమార్థ్ నికేతన్ ఆశ్రమ్), స్వామి శివదాసానంద (శివానంద యోగా రిట్రీట్, ఆస్ట్రియా)ల నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆరోగ్యంకోసం యోగ అన్న అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.