అంతర్జాతీయం

ఐసిజె న్యాయమూర్తిగా భండారీ మళ్లీ నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యునైటెడ్ నేషన్స్, జూన్ 20: అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె) న్యాయమూర్తిగా దల్వీర్ భండారీని భారత్ మళ్లీ నియమించింది. అంతర్జాతీయ న్యాయస్థానంలో జడ్జిగా నియమించడానికి 2012 ఏప్రిల్‌లో ఐరాస జనరల్ అసెంబ్లీ, భద్రతా మండలిలో జరిగిన ఓటింగ్‌లో భండారీ ఎన్నికయ్యారు. యునైటెడ్ నేషన్స్ ప్రధాన అంగంగా ఉన్న ఐసిజె నెదర్లాండ్ రాజధాని హేగ్ నుంచి పనిచేస్తోంది. ఆయన పదవీకాలం 2018 ఫిబ్రవరితో ముగియనుంది. 69 ఏళ్ల భండారీని రీ నామినేట్ చేస్తూ ఐరాస ప్రధాన కార్యదర్శి అంటోనియో గుట్టెర్రెస్‌కు సోమవారం భారత్ పత్రాలు అందజేసింది. నవంబర్‌లో జరిగే ఐసిజె ఎన్నికల్లో భండారీ మళ్లీ గెలిస్తే మూడేళ్లపాటు పదవిలో ఉంటారు. సముద్ర జలాల వివాదం, జాత్యాహంకార నేరాలు, సముద్ర తీరాల సరిహద్దుల వివాదం, ఉగ్రవాదానికి సంబంధించిన అనేక కేసుల్లో ఆయన కీలకమైన తీర్పులు వెలువరించారు. ఐసిజెలో ప్రవేశానికి ముందు భారత్‌లో ఆయన ఇరవై ఏళ్లపాటు ఉత్యున్నత న్యాయస్థానంలో సేవలందించారు. సుప్రీం కోర్టులో సీనియర్ జడ్జిగా పనిచేశారు.