అంతర్జాతీయం

విశ్వంలో మరో పది భూమిని పోలిన గ్రహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, జూన్ 20: విశ్వంలో భూమిని పోలిన గ్రహాల అనే్వషణను నిరంతరం సాగిస్తున్న అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) తాజాగా మలో 200 కొత్త గ్రహాలను కనుగొంది. వీటిలో పది గ్రహాల పరిమాణం, వాటిలోని వాతావరణం జీవానుకూలంగా ఉందని, అచ్చం ఇవి భూమి స్వరూపానే్న కలిగి ఉన్నాయని నాసా వెల్లడించింది. గత కొనే్నళ్లుగా జీవానుకూల గ్రహాల అనే్వషణను సాగిస్తున్న కెప్లర్ టెలీస్కోప్ ఈ సుదూర కొత్త గ్రహాల ఉనికిని కనుగొంది. గత నాలుగేళ్లుగా జరుగుతున్న ఈ అనే్వషణలో గోల్డీలాక్స్ ప్రాంతంలో 49 గ్రహాలను గుర్తించింది. గోల్డీలాక్స్ ప్రాంతంలో ఉన్న గ్రహాలు తాము పరిభ్రమిస్తున్న నక్షత్రానికి అతి దగ్గరగా లేదా అతి దూరంగా ఉండకుండా సమశీతోష్ణతను కలిగి ఉంటాయి. ఈ విశ్వంలో భూగోళం ఒక్కటే కాదని దీని తరహా వాతావరణం కలిగిన 10 గ్రహాలు ఉన్నాయన్న నిజాన్ని ఈ టెలీస్కోప్ అందించిందిన కెప్లర్ శాస్తవ్రేత్త మారియో పెరెజ్ పేర్కొన్నారు. ఇప్పటికే ఈ టెలిస్కోప్ ద్వారా ఎంతో ఆసక్తిని కలిగించే సుదూర గ్రహాలు ఎన్నింటినో నాసా శాస్తవ్రేత్తలు కనుగొన్నారు. ఇనే్నళ్లుగా గ్రహాల అనే్వషణ జరుపుతున్నా ఇప్పటి వరకూ నక్షత్ర వ్యవస్థలో ఒక శాతంలో పావువంతును మాత్రమే కెప్లర్ అనే్వషించ గలిగింది. ఈ గెలాక్సీలో దాదాపు 200 బిలియన్ నక్షత్రాలు ఉన్నట్టు అంచనా. తాజాగా కనుగొన్న గ్రహాల్లో పది గ్రహాల వాతావరణం జీవానుకూలంగా భూమి మాదిరిగానే ఉందని నాసా స్పష్టం చేసింది. వీటిలో ఏడు గ్రహాలు తమ నక్షత్రాల చుట్టూ అంత దూరంగానూ అంత దగ్గరగానూ కాకుండా పరిభ్రమిస్తున్నాయని తెలిపింది. వీటిలో జీవానుకూలత ఉన్నంత మాత్రాన అక్కడ ఇప్పటికే జీవి మనుగడ సాగిస్తున్నట్టు కాదని, జీవ జాతులు నివసించడానికి అనువైన వౌలిక పరిస్థితులు ఉన్నాయన్నదే తమ ఉద్దేశమని నాసా పేర్కొంది.