అంతర్జాతీయం

కొరియా ద్వీపకల్పానికి అమెరికా సూపర్‌సోనిక్ బాంబర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, జూన్ 20: అమెరికా, ఉత్తర కొరియా మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. అమెరికా విద్యార్థి ఒకరు మరణించిన నేపథ్యంలో ట్రంప్ సర్కార్ రెండు సూపర్‌సోనిక్ బాంబర్లను కొరియా ద్వీపకల్పానికి తరలించింది. గతంలో ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు నిర్వహించినప్పుడూ అమెరికా ఇదే నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు 17నెలల నిర్బంధం అనంతరం ఉత్తర కొరియా నిర్బంధం నుంచి విడుదలైన అమెరికా విద్యార్థి మరణించడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ఉత్తర కొరియాకు తన శక్తిసామర్థ్యాలను చాటిచెప్పడానికే ఈ బి-1బి బాంబర్ల విన్యాసాన్ని అమెరికా జరిపిందని దక్షిణ కొరియా తెలిపింది.