అంతర్జాతీయం

భారత్‌కు అమెరికా గార్డియన్ డ్రోన్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 22: భారత్‌కు 22 గార్డియన్ డ్రోన్ విమానాల విక్రయాన్ని అమెరికా ఆమోదించింది. 26న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య శిఖరాగ్ర భేటీ జరుగనున్న తరుణంలో వెలువడిన ఈ నిర్ణయం రెండు దేశాల సంబంధాలను కొత్త పుంతలు తొక్కించేదేనని చెబుతున్నారు. దాదాపు మూడు బిలియన్ డాలర్లు ఖర్చయ్యే ఈ డ్రోన్‌లను భారత్‌కు విక్రయించాలన్న నిర్ణయాన్ని అమెరికా విదేశాంగ విభాగం ఆమోదించింది. భారత్‌తో సత్వర ఫలితాలు సాధించే సంబంధాలను కొనసాగించాలని ట్రంప్ భావిస్తున్నారనడానికి ఈ నిర్ణయమే నిదర్శమనమని చెబుతున్నారు. అలాగే భారత్‌ను బలమైన రక్షణ భాగస్వామ్య దేశంగా అమెరికా పరిగణిస్తోందనడానికీ ఇది నిదర్శనమేనని అభిజ్ఞ వర్గాలు అంటున్నాయి.