అంతర్జాతీయం

భారత్, రష్యా మధ్య సైనిక సహకారానికి రోడ్‌మ్యాప్ రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, జూన్ 23: భారత్, రష్యాల మధ్య ద్వైపాక్షిక మిలిటరీ సహకారాన్ని పెంపొందించుకోవడానికి రూపొందించిన ఒక రోడ్‌మ్యాప్‌పై భారత రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ, రష్యా రక్షణ మంఅతి సెర్గీ షోయిగు శుక్రవారం సంతకాలు చేశారు. రెండు దేశాల సాయుధ బలగాల యుద్ద సంసిద్ధతను పెంచుకోవడం కోసం సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని, అలాగే రక్షణ రంగానికి సంబంధించిన వివిధ విషయాల్లో అనుభవాలను ఇచ్చి పుచ్చుకోవడానికి కృత నిశ్చయంతో ఉన్నామని శుక్రవారం ఇక్కడ మిలిటరీ-సాంకేతిక సహకారంపై భారత్-రష్యా మంత్రిత్వ శాఖల కమిషన్ 17వ సమావేశంలో మాట్లాడుతూ షోయిగు చెప్పారు.
భారత్, రష్యాల మధ్య మిలిటరీ సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి ఇరు దేశాలకు చెందిన నిపుణులు ఒక రోడ్‌మ్యాప్‌ను రూపొందించారని, ద్వైపాక్షిక కాంట్రాక్ట్‌ల గురించిన ప్రణాళికలకు ఇది ఒక బేసిక్ డాక్యుమెంట్‌గా ఉంటుందని ఆయన తెలిపారు. సమావేశం చివర్లో షోయిగు, జైట్లీలు డాక్యుమెంట్‌పై సంతకాలు చేశారని అధికార టాస్ వార్తాసంస్థ తెలిపింది.
అయితే ఈ రోడ్‌మ్యాప్‌లోని వివరాలను మాఅతం ఆ వార్తాసంస్థ తెలపలేదు. కీలక మిలిటరీ హార్డ్‌వేర్ ఉత్పాదనలో ఉమ్మడి తయారీ ద్వారా రక్షణ సంబంధాలను మరింతగా తీవ్రం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఇటీవల జరిగిన వార్షిక శిఖరాగ్ర చర్చల్లో నిర్ణయించిన మూడు వారాల తర్వాత జైట్లీ, షోయిగులు సమావేశం కావడం గమనార్హం. మూడు రోజుల పర్యటనకోసం రష్యా వచ్చిన జైట్లీ బుధవారం రష్యా పారివ్రామికవేత్తలతో మాట్లాడుతూ భారతీయ కంపెనీలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడానికి, అలాగే అడ్వాన్స్‌డ్ మిలిటరీ ప్లాట్‌ఫామ్‌లను సంయుక్తంగా తయారు చేయడానికి ముందుకు రావలసిందిగా పిలుపునిచ్చారు.