అంతర్జాతీయం

ప్రవాస భారతీయుల్లో అదే ఉత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 23: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమయ్యేందుకు వాషింగ్టన్ నగరానికి విచ్చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కనీవినీ ఎరుగనంత భారీ స్థాయిలో ఘనస్వాగతం పలికేందుకు అక్కడి ప్రవాస భారతీయులు ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. మోదీ గత ఏడాది అమెరికాలో పర్యటించినప్పుడు న్యూయార్క్/న్యూజెర్సీ లేదా సిలికాన్ వ్యాలీలో రెండు భారీ బహిరంగ సభల్లో పాల్గొని ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన విషయం విదితమే. ఈ రెండు ప్రాంతాల్లో ఉన్నంత పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు వాషింగ్టన్‌లో ఉండకపోవచ్చు. కానీ అక్కడి ప్రవాస భారతీయుల్లో మోదీ పట్ల ఉత్సాహం మాత్రం అదే స్థాయిలో ఉంది. ప్రస్తుతం ఇక్కడ మూడు రోజుల పాటు పర్యటించబోతున్న మోదీకి సాధ్యమైన ప్రతిచోటా ఘనస్వాగతం పలకాలని ప్రవాస భారతీయులు యోచిస్తున్నారని, మోదీ రాక కోసం వీరంతా ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారని అమెరికాలో బిజెపి మిత్ర బృంద నాయకుడు అడపా ప్రసాద్ తెలిపారు.
అమెరికాలో భారత ప్రధాన మంత్రికి స్వాగతం పలికే కార్యక్రమాల నిర్వహణలో అడపా ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే మోదీ ఈసారి న్యూయార్క్, సిలికాన్ వ్యాలీలో మాదిరిగా కాకుండా ఆదివారం వాషింగ్టన్ డిసి శివార్లలోని వర్జీనియాలో ప్రవాస భారతీయుల కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఆదివారం మధ్యాహ్నం జరిగే ఈ కార్యక్రమానికి చాలా కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించారు. దీంతో ఈ కార్యక్రమం అమెరికాలోని ప్రవాస భారత సంఘాల నాయకులు, ప్రముఖ ఇండో-అమెరికన్లు సహా దాదాపు 600 మందికి మాత్రమే పరిమితం కాబోతున్నట్లు తెలుస్తోంది. వీరంతా తమ ప్రియతమ నాయకుడైన మోదీని చూసేందుకు అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి వాషింగ్టన్ డిసికి వస్తున్నారని అడపా ప్రసాద్ తెలిపారు.
వాషింగ్టన్‌లో మోదీ పర్యటన సందర్భంగా ప్రవాస భారతీయుల కార్యక్రమాలతో పాటు పలు ఇతర కార్యక్రమాలను నిర్వహించాలని అక్కడి మేథావులు, వివిధ సంఘాల నాయకులు యోచిస్తున్నారు. సోమవారం భారత్-అమెరికా శిఖరాగ్ర సమావేశంతో పాటుగా ఈ కార్యక్రమాలు జరుగనున్నాయి. వాషింగ్టన్‌లోని ఈస్ట్‌వెస్ట్ సెంటర్, భారత వాణిజ్య, పారిశ్రామిక మండల్ల సమాఖ్య (్ఫక్కీ) సోమవారం అమెరికా పార్లమెంట్ ఉభయ సభల్లోని భారత అనుకూల బృందాల (ఇండియా కాకస్)తో కలసి ‘ఇండియా మ్యాటర్స్ ఫర్ అమెరికా/అమెరికా మ్యాటర్స్ ఫర్ ఇండియా’ అనే ప్రచురణ, వెబ్ సమాచార కేంద్రాన్ని ప్రారంభించనున్నాయి. అలాగే భారత్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలను పటిష్టవంతం చేసే అంశంపై అమెరికాలోని ప్రముఖ మేథో సంస్థ అయిన హడ్సన్ ఇన్‌స్టిట్యూట్, భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) కలసి సోమవారం చర్చా గోష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించనుండగా, భారత్-అమెరికా సంబంధాలపై ఎఫ్‌ఐఐడిఎస్ (్ఫండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్) ఈ నెల 25వ తేదీన మినీ కాన్ఫరెన్స్‌ను నిర్వహించనుంది.
మోదీ రాక కోసం ఎదురు చూస్తున్నాం : అమెరికా
ఇదిలావుంటే, భారత్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు అమెరికా ఎదురు చూస్తోందని ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది. అమెరికా పర్యటన సందర్భంగా మోదీ వచ్చే వారం తొలిసారి ట్రంప్‌తో సమావేశం కానున్న నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హీథర్ నౌరెట్ విలేఖరుల సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
ఉగ్రవాదంపై పోరు సహా అనేక రంగాల్లో భారత్, అమెరికా పరస్పరం సహకారాన్ని పెపొందించుకోవాల్సిన అవసరం ఉందని, అందుకే మోదీ రాక కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నామని ఆమె ఉద్ఘాటించారు.