అంతర్జాతీయం

ఉగ్రవాదాన్ని కలిసికట్టుగా అంతంచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్యసమితి, జూన్ 24: అంతర్జాతీయంగా వేళ్లూనుకొని ప్రపంచ దేశాలపై పంజా విసురుతున్న ఉగ్రవాదాన్ని అంతమొందించడం ఏ ఒక్క దేశానికో సాధ్యమయ్యే పని కాదని, దీనికి అన్ని దేశాలు కలిసికట్టుగా కృషి చేయాలని ఐరాసలోని భారత ఉప శాస్వత రాయబార ప్రతినిధి తన్మయ లాల్ అన్నారు. నేడు ప్రపంచంలోని అన్ని దేశాలకు ఉగ్రవదా ముప్పు పొంచి ఉందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన ఐక్యరాజ్య సమితి ఉగ్రవాద నిర్మూలన కేంద్ర సలహా బోర్డు సమావేశంలో లాల్ మాట్లాడుతూ, ఉగ్రవాదాన్ని ఒంటరిగా ఎదుర్కొనేంత శక్తి, సామర్థ్యాలు ప్రస్తుతం ఏ ఒక్క దేశానికీ లేదని, అంతగా టెర్రరిజం విశ్వవాప్తంగా విస్తరించింది అన్ని దేశాలకు పెను సవాలును విసురుతోందని చెప్పారు. నిజాయితీగా నిబద్ధతగా అన్ని దేశాలు పరస్పరం సహాయ సహకారాలతో అన్ని స్థాయిల్లోనూ కలిసికట్టుగా పనిచేస్తేనే ఉగ్రభూతాన్ని అంతం చేయగలమని అన్నారు.