అంతర్జాతీయం

పోర్చుగల్ టు అమెరికా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లిస్బన్ / వాషింగ్టన్, జూన్ 24: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత కీలకమైన మూడు దేశాల విదేశీ పర్యటన పోర్చుగల్‌తో ప్రారంభమైంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తరువాత, ఆయనతో మోదీ తొలిసారి భేటీ కానున్నారు. ఇరుదేశాలకూ ఇది కీలకమైన సమావేశం కానుంది. హెచ్1బి వీసాల అంశంతో పాటు, ఇరుదేశాల రక్షణ భాగస్వామ్యం, ద్వైపాక్షిక వాణిజ్యంపై గుణాత్మక నిర్ణయాలు వెలువడుతాయని ఇరుదేశాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ప్రపంచంలో మంచికోసం పనిచేసే శక్తిగా భారత్‌ను డొనాల్డ్ ట్రంప్ గుర్తించారని వైట్‌హౌస్ వాషింగ్టన్‌లో ప్రకటించారు. వైట్‌హౌస్‌లో మోదీకి ట్రంప్ విందు ఇవ్వనున్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ఒక విదేశీ నేతకు వైట్‌హౌస్‌లో అధికారికంగా విందునివ్వటం కూడా ఇదే తొలిసారి. తన విదేశీ పర్యటనలో భాగంగా మోదీ మొదట శనివారం పోర్చుగల్ చేరుకున్నారు. ప్రధానికి లిస్బన్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ప్రొటోకాల్‌ను పక్కన పెట్టి పోర్చుగల్ విదేశాంగ మంత్రి ఆగస్టో శాంటోస్ సిల్వా ప్రధానికి స్వాగతం పలికారు. అనంతరం మోదీ పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టాతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రధాని గౌరవార్థం కోస్టా ఏర్పాటు చేసిన విందులో ప్రత్యేక గుజరాతీ భోజనాన్ని ఏర్పాటు చేయడంతో పాటుగా మోదీకి ఆయన గుజరాతీ భాషలో స్వాగతం పలికారు. తన పర్యటన భారత్, పోర్చుగల్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి తోడ్పడుతుందన్న అశాభావాన్ని నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.
చర్చల అనంతరం ఇరువురు నేతలు పత్రికా సమావేశంలో మాట్లాడారు. ప్రధాని తన ప్రకటనను గత వారం పోర్చుగల్‌లో సంభవించిన భారీ కార్చిచ్చులో మృతి చెందిన వారికి శ్రద్ధాంజలి తెలియజేయడంతో ప్రారంభించారు. ద్వైపాక్షిక చర్చల్లో తాము అనేక అంశాలపై విస్తృత స్థాయి చర్చలు జరిపామని తెలిపిన మోదీ పోర్చుగల్ ఆర్థికాభివృద్దికి భారత్ ఎన్నో అవకాశాలను అందిస్తోందని తెలిపారు. గతంలో ఇరుదేశాల మధ్య నౌకా వాణిజ్యం సంబంధాలను కల్పించగా, ఇప్పుడు డిజిటల్ లింక్ తమ దేశాలను కలుపుతుందన్నారు. సైన్స్, టెక్నాలజీ రంగంలో ఇరు దేశాల మధ్య సహకారానికి విస్తృతమైన అవకాశాలున్నాయని చెప్పిన ప్రధాని 40లక్షల యూరోలతో సంయుక్తంగా ఒక సైన్స్, టెక్నాలజీ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. లిస్బన్ యూనివర్శిటీలో భారతీయ శాస్త్రాల అధ్యయనానికి ఒక పీఠాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని తెలిపారు. అంతేకాకుండా ఇరుదేశాల ప్రయోజనం కోసం హిందీ-పోర్చుగీస్ భాషల్లో డిక్షనరీని రూపొందించనున్నట్లు కూడా తెలిపారు. ఇరు దేశాల ప్రధాన మంత్రుల సమావేశం వివరాలను విదేశాంగ శాఖ ప్రతినిధి గోపాల్ బాగ్లే ట్విట్టర్‌లో తెలియజేస్తూ, వీరి సమావేశానికి సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా అందులో ఉంచారు. కాగా, పోర్చుగల్ పర్యటనను ముగించుకుని ప్రధాని మోదీ ఆదివారం అమెరికా చేరుకుంటారు.

చిత్రం.. ప్రధాని మోదీకి సాదర స్వాగతం పలుకుతున్న పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టా