అంతర్జాతీయం

మక్కా మసీదు పేల్చివేతకు కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియాద్, జూన్ 24: ముస్లింలకు పవిత్ర మాసమైన రంజాన్‌లో మక్కా మసీదు పేల్చివేసి, విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు చేసిన ఆత్మాహుతి దాడి యత్నాన్ని సౌదీ భద్రతా దళాలు భగ్నం చేశాయి. శనివారం మక్కా పరిసర ప్రాంతాల్లోని అజ్యాద్ అల్ మసాఫి, జెద్దాలలో భద్రతా దళాలు గస్తీ కాస్తున్న సమయంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తి తారసపడ్డాడు. దీంతో అతనిపై కాల్పులు జరపడంతో ఆ ఉగ్రవాది తనను తాను పేల్చుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడని సౌదీ అధికారులు తెలిపారు. ఈ సంఘటనలో మక్కాకు సమీపంలోని మూడు అంతస్తుల భవనం పూర్తిగా దెబ్బతిందని, ఆరుగురు విదేశీయులు, ఐదుగురు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయని చెప్పారు. ఉగ్రవాది సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి ఓ మహిళతోపాటు ఐదుగురిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఒక్కసారిగా విస్ఫోటనం జరగడంతో ఆ ప్రాంతంలోని ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

చిత్రం.. ముస్లింలకు పవిత్రస్థలమైన మక్కాలో ఆఖరి శుక్రవారం ప్రార్థనలు చేస్తున్న దృశ్యం