అంతర్జాతీయం

సల్మా డ్యామ్‌వద్ద తాలిబన్ల ఉగ్రదాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్, జూన్ 25: అఫ్గానిస్తాన్‌లో భారత్ నిర్మించిన సల్మా డ్యామ్ చెక్‌పోస్టు వద్ద తాలిబన్లు ఉగ్రదాడికి పాల్పడటంతో 10మంది పోలీసులు దుర్మరణం చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హీరత్ ప్రావిన్స్‌లోని సల్మా డ్యామ్ చెక్‌పోస్టు వద్ద శనివారం పొద్దుపోయిన తర్వాత తాలిబన్లు దాడిచేసి పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో పదిమంది పోలీసులు మృతిచెందగా నలుగురు గాయపడ్డారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు తాలిబన్ ఉగ్రవాదులు హతమయ్యారని అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా, భారత్ నిర్మించిన సల్మా డ్యామ్‌ను ప్రధాని మోదీ, అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ గత ఏడాది జూన్‌లో ప్రారంభించిన విషయం విదితమే.