అంతర్జాతీయం

‘నిజమైన మిత్రుడి’కి స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 25: ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘నిజమైన మిత్రుడు’గా అభివర్ణించారు. సోమవారం శే్వతసౌధంలో ప్రధాని మోదీతో వ్యూహాత్మక అంశాలను చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ‘శే్వతసౌధంలో ప్రధాని నరేంద్ర మోదీకి సోమవారం స్వాగతం చెప్పేందుకు ఎదురు చూస్తున్నాను. ఒక నిజమైన మిత్రుడితో ముఖ్యమైన వ్యూహాత్మక అంశాలను చర్చించబోతున్నాం’ అని ట్రంప్ తన అధికారిక ట్విట్టర్‌లో ఉంచిన ట్వీట్‌లో వ్యాఖ్యానించారు. కాగా, తనకు వ్యక్తిగత హార్దిక స్వాగతం పలికినందుకు ట్రంప్‌కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం శే్వతసౌధంలో ట్రంప్‌తో సమావేశం, చర్చల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తన్నట్లు ట్రంప్ ట్వీట్‌కు సమాధానంగా చేసిన ట్వీట్‌లో మోదీ అన్నారు. కాగా, రెండు రోజుల అమెరికా పర్యటనకోసం ఆదివారం వచ్చిన ప్రధాని మోదీకి వాషింగ్టన్ డిసి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఆయన సోమవారం మధ్యాహ్నం వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో ముఖాముఖి చర్చలు జరపనున్నారు. అలాగే మోదీ గౌరవార్థం ట్రంప్ విందు ఇవ్వబోతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ ఒక విదేశీ నేతకు ఇస్తున్న తొలి విందు ఇదే కావడంతో ఈ విందుకు ఎంతో ప్రాధాన్యత లభించింది. మోదీ పర్యటనను ఒక ప్రత్యేకమైనదిగా చేయడం కోసం వైట్‌హౌస్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోందని, ఆయనకు ఎర్ర తివాచీ పరిచి స్వాగతం చెప్తాం అని వైట్‌హౌస్ వద్ద అమెరికా ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.
కాగా, మోదీని స్వయంగా చూడడం కోసం ఆయన బస చేసిన విల్లార్డ్ ఇంటర్‌కాంటినెంటల్ హోటల్ వెలుపల భారీ సంఖ్యలో వేచి ఉన్న ప్రవాస భారతీయులు ఆయనను చూడగానే హర్షాతిరేకంతో కేకలు వేస్తూ కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు. తన పర్యటనలో భాగంగా మోదీ యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ సహా అమెరికా అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల సిఈఓలతో సమావేశమై వీసా సమస్యలు, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనలాంటి అంశాలపై వారితో చర్చించనున్నారు. అలాగే ప్రవాస భారతీయులను కూడా కలుసుకోనున్నారు.
వాషింగ్టన్ ఎయర్‌పోర్టులో ప్రధాని మోదీతో కరచాలనం చేసేందుకు పోటీపడుతున్న ఎన్నారైలు

చిత్రం.. వాషింగ్టన్ ఎయర్‌పోర్టులో మోదీకి స్వాగతం పలుకుతున్న ప్రవాస భారతీయులు.