అంతర్జాతీయం

మన బంధం అనిర్వచనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 26: అమెరికాతో భారతదేశ వ్యూహాత్మక అనుబంధం అనిర్వచనీయమైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటన సందర్భంగా ఆయన వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాల గురించి ప్రస్తావించారు. ఉగ్రవాదం, విప్లవాత్మక ఆలోచనలు, సంప్రదాయేతర రక్షణ ప్రమాదాల నుంచి ప్రపంచాన్ని రక్షించటంపై రెండు దేశాలూ కలిసి పని చేస్తున్నాయని మోదీ అన్నారు. బెల్ట్‌వే-రైసీనా హిల్స్ మధ్య మరింత బలమైన భాగస్వామ్యం ఏర్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వాషింగ్టన్ నుంచి అమెరికాలో అంతర్రాష్ట హైవే-495ని బెల్ట్‌వే అంటారు. రైసీనాహిల్స్ అంటే ఢిల్లీలో రాష్టప్రతి భవన్ ఉన్న ప్రాంతమని తెలిసిందే. ప్రస్తుతం అనిశ్చితంగా ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మోదీ మాట్లాడుతూ ‘ఏడాది తరువాత నేను తిరిగి అమెరికా వచ్చాను. రెండు దేశాల మధ్య పెరుగుతున్న అనుబంధాన్ని ఇది తెలియజేస్తోంది. రెండు దేశాల మధ్య స్థిరంగా ఉన్న వ్యవస్థలు, ప్రజలు, సంస్థల మధ్య సంబంధాలు, సహకారాలు బలపడుతున్నాయి. ప్రజాస్వామ్యంలో మార్పు అనేది ఈ అనుబంధం మరింత శక్తిమంతం చేసుకునేందుకు ఒక ఉపకరణం మాత్రమే. రెండు దేశాల మధ్య భాగస్వామ్యం ప్రపంచానికి మేలు చేస్తుంది’ అని మోదీ స్పష్టం చేశారు. రెండు దేశాల పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తాము పని చేస్తున్నామని అన్నారు.

చిత్రం.. వాషింగ్టన్‌లో నిర్వహించిన ఆహ్వాన కార్యక్రమంలో జాతీయ గీతాన్ని ఆలపించినపుడు లేచి నిలబడిన
ప్రధాని నరేంద్ర మోదీ