అంతర్జాతీయం

మచ్చలేని పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 26: మూడేళ్ల పాలనలో తమ ప్రభుత్వంపై ఒక్క అవినీతి ఆరోపణ లేదని, మచ్చలేని స్వచ్ఛమైన పాలనను అందిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వాలను మట్టికరిపించారంటే దానికి ప్రధాన కారణం అవినీతేనని ఆయన పేర్కొన్నారు. భారతీయులు అవినీతిని అసహ్యించుకుంటారని అన్నారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇక్కడి ప్రవాస భారతీయులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మోదీ మాట్లాడారు. భారత్‌లో అవినీతిని అంతం చేయడంలో తమ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి మోదీ తెలిపారు. జిఎస్టీ, నోట్ల రద్దు, వ్యవసాయం అంతరిక్ష పరిశోధనల్లో సాధించిన విజయాల గురించి ఆయన ప్రముఖంగా మాట్లాడారు. తాను అధికారం చేపట్టినప్పటినుంచి గడచిన మూడేళ్లలో తమ ప్రభుత్వంపై ఒక్క మచ్చ పడలేదని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని దేశంలో ఎంతో అభివృద్ధి సాధించామని అన్నారు. వౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి కేంద్రీకరించి ప్రపంచ విపణిలో భారత్‌కు ఓ సమున్నత స్థానం సాధించామని పేర్కొన్నారు. దేశంలో ఇప్పుడు అభివృద్ధి పరుగులు తీస్తోందని మోదీ అన్నారు. దీనికి తమ ప్రభుత్వంపై సామాన్యుడు పెట్టుకుంటున్న ఆశలే కారణమని చెప్పారు. దాని ఫలితంగా ఇప్పుడు భారత్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సైతం అద్వితీయంగా పెరిగాయని, దీనికి అంతర్జాతీయ గణాంకాలు, సూచీలు వెలువరిస్తున్న సంస్థల తాజా నివేదికలే నిదర్శనమని అన్నారు. భారత్ అభివృద్ధిలో ప్రవాసీయులూ సహాయ సహకారాలందించాలని కోరారు. ఈ దిశగా వారు చేస్తున్న కృషిని మోదీ అభినందించారు. భారత్, అమెరికాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉంటే ప్రవాసీయులు మరింత అభివృద్ధి చెందే అవకాశాలుంటాయని పేర్కొన్నారు. అభివృద్ధికాముక వాతావరణం నెలకొనడంతో భారత్‌లో కూడా ప్రజలు ఇప్పుడు దేశ సర్వతోముఖాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. భారత్ అభివృద్ధికి ప్రవాసీయులు కంటున్న కలలను సాకారం చేస్తామని మోదీ పేర్కొన్నారు. 50 నిముషాలపాటు దాదాపు 600 మంది ప్రవాస భారతీయులనుద్దేశించి మోదీ హిందీలో ప్రసంగించారు. అమెరికా పర్యటనలో భాగంగా 2014లో తాను ఇక్కడి వచ్చినప్పుడు మేడిసన్ స్క్వేర్‌లో 18000 మంది ప్రవాసీయులతో నిర్వహించిన సమావేశం మాదిరిగానే ఈసారి ఓ సమావేశాన్ని నిర్వహిద్దామనుకున్నామని అయితే అప్పటి ఈవెంట్ విజయవంతానికి కృషి చేసినవారిని ఈసారి ప్రత్యక్షంగా కలవాలన్నామని చెప్పారు. అందుకే మరో ఈవెంట్‌ను నిర్వహించ లేదని పేర్కొన్నారు.