అంతర్జాతీయం

మీ జవాన్లు గీత దాటారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జూన్ 27: భారత సైన్యాలు సిక్కిం ప్రాంతంలో సరిహద్దులను అతిక్రమించిందని చైనా ఆరోపిస్తూ, వారిని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. అంతేకాదు, సరిహద్దుల్లో ఉద్రిక్తత కారణంగానే మానస సరోవర్ యాత్రకు వెళ్తున్న భారతీ యాత్రికుల కోసం నాథులా పాస్ మార్గాన్ని మూసివేసినట్లు స్పష్టం చేసింది. సిక్కిం సెక్టార్‌లో భారత సైన్యాలు చైనా భూభాగంలోకి అక్రమంగా చొరబడ్డాయని ఆరోపిస్తూ న్యూఢిల్లీ, బీజింగ్‌లలో దౌత్యపరమైన నిరసనను తెలియజేసినట్లు కూడా చేసింది. ‘మా వైఖరిని వివరిస్తూ బీజింగ్, న్యూఢిల్లీలో దౌత్యపరంగా లిఖితపూర్వక నిరసనలు తెలియజేశాం’ అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లు కాంగ్ మంగళవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో తెలియజేశారు. ‘మా భౌగోళిక సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవాలన్న మా వైఖరి తిరుగులేనిది. భారత్ కూడా ఈ దిశగా ఆలోచించి తక్షణమే సరిహద్దులను దాటి చైనా భూభాగంలోకి ప్రవేశించిన తన జవాన్లను వెనక్కి పిలిపిస్తుందని మేము ఆశిస్తున్నాం’ అని ఆయన అన్నారు. సరిహద్దు సమస్య దృష్ట్యా భద్రతా కారణాల కోసం నాథులా పాస్‌గుండా టిబెట్‌లోకి ప్రవేశించే భారతీయ యాత్రికుల సందర్శనను నిలిపివేసినట్లు చైనా గత రాత్రి ఒక ప్రకటనలో తెలిపింది. భారత సరిహద్దు భద్రతా దళాలు భారత్-చైనా సరిహద్దులోని సిక్కిం ప్రాంతంలో సరిహద్దులను దాటి చైనా భూభాగంలోకి ప్రవేశించడమే కాకుండా డోంగ్‌లాంగ్ ప్రాంతంలో చైనా సైనికుల రొటీన్ కార్యకలాపాలను అడ్డుకున్నారని, చైనా సైన్యం కూడా వాటిని తిప్పికొట్టే చర్యలు తీసుకుందని విదేశాంగ శాఖ ప్రతినిధి గెంగ్ షువాంగ్ ఆ ప్రకటనలో తెలిపారు. డోంగ్‌లాంగ్ ప్రాంతం తమ భూభాగమని చెప్పుకొంటున్న చైనా ఇటీవల ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం చేపట్టింది.
అయితే భారత జవాన్లు సరిహద్దులను దాటి చైనా భూభాగంలోకి ప్రవేశించి ఈ రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకున్నారని ఆయన ఆ ప్రకటనలో ఆరోపించారు. ఈ సంఘటన కారణంగానే నాథులా పాస్ గుండా మానస సరోవర్ వెళ్లే భారతీయ యాత్రికులను చైనాలోకి ప్రేశించేందుకు ఏర్పాట్లను నిలిపివేసినట్లు ఆయన ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.