అంతర్జాతీయం

మనది సహజసిద్ధ భాగస్వామ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్‌స్టెర్‌డం, జూన్ 27: ఆర్థిక అభివృద్ధిలో నెదర్లాండ్స్‌తో భారత్‌కు సహజసిద్ధమైన భాగస్వామ్యం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అమెరికా పర్యటన ముగించుకుని అమ్‌స్టెర్‌డం చేరుకున్న నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ ర్యూట్‌తో విస్తృత చర్చలు జరిపారు. పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని, పునర్వినియోగ ఇంధన అభివృద్ధిలో మరింతగా సహకరించుకోవాలని ఇరువురు ప్రధానులు సంకల్పించారు. ఈ సందర్భంగా సామాజిక భద్రత, సాంస్కృతిక, జల సహకారంపై మూడు ఒప్పందాలపై సంతకం చేశారు. క్షిపణి టెక్నాలజీ నియంత్రణ వ్యవస్థ (ఎమ్‌టిసిఆర్)లో భారత సభ్యత్వాన్ని బలపరిచినందుకు నెదర్లాండ్స్‌కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. నెదర్లాండ్స్ మద్దతు వల్లే భారత్‌కు ఇందులో సభ్యత్వం తగ్గిందని పేర్కొన్న మోదీ ‘ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి. ద్వైపాక్షిక సహకారమూ విస్తరిస్తోంది’అని అన్నారు. శతాబ్దకాలంగా కొనసాగుతున్న స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. భారత్‌లో ప్రత్యక్ష పెట్టుబడులు పెడుతున్న దేశాల్లో నెదర్లాండ్స్‌కు మూడోస్థానం ఉందన్నారు. అంతర్జాతీయ శక్తిగా భారత్ ఎదగడమన్నది రాజకీయంగానే కాకుండా ఆర్థికంగా కూడా ఎంతో కీలక పరిణామమని నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం, ఒకే రకమైన విలువలు ఉన్నాయని అన్నారు. పారిస్ పర్యావరణ పరిరక్షణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నందుకు భారత్‌ను అభినందించిన ఆయన పునర్వినియోగ ఇంధన అంశంపైనా భారత్ ఎంతో కృషి చేస్తోందని చెప్పారు. స్వచ్ఛ్ భారత్, మేక్ ఇన్ ఇండియా వంటి సుస్థిర అభివృద్ధికి దోహదం చేసే విధానాలను ప్రకటించినందుకు మోదీని అభినందించారు. ఈ లక్ష్యాలను సాధించడానికి భారత్‌కు తాము అన్ని విధాలుగా తోడ్పడతామని హామీ ఇచ్చారు. భారత్ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక శక్తి అని పేర్కొన్న మార్క్ దీన్ని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివర్ణించారు. భారత్ మార్కెట్ విస్తృతికి ఎంతో అవకాశం ఉందని, తాము కూడా ఇందులో పాలుపంచుకుంటామని అన్నారు. ఐరోపా భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశమని, 20శాతానికి పైగా భారత ఎగుమతులు ఐరోపాకు నెదర్లాండ్స్ ద్వారానే చేరుతాయన్నారు. ఆ విధంగా చూస్తే ఐరోపాలో ప్రవేశించేందుకు భారత్‌కు నెదర్లాండ్స్ సింహద్వారమన్నారు. రానున్న రోజుల్లో ఇరు దేశాల సంబంధాలు మరింతగా విస్తరించేందుకు ఎంతో అవకాశం ఉందని, మూల ధన ప్రవాహానికి అడ్డుకట్టలు తొలగించడం ద్వారా అందుకు తాము బలమైన బాటలు వేశామని చెప్పారు. భారత్‌తో దౌత్యపరమైన సంబంధాలను తాము ఏర్పరచుకుని 70సంవత్సరాలు పూర్తయిందని గుర్తు చేసిన నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ మరో 70సంవత్సరాలు ఆ పైనా కూడా రెండు దేశాలూ ఇదే స్థాయి సాన్నిహిత్యాన్ని కొనసాగించేందుకు ఎన్నో అవకాశాలున్నాయన్నారు.

చిత్రం.. సంయుక్త విలేఖరుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ ర్యూట్ కరచాలనం