అంతర్జాతీయం

అమెరికాలో ఇక సత్వర ఎంట్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 27: ఇకపై అమెరికా వెళ్లే సాధారణ భారతీయులు విమానాశ్రయంలో దిగిన తర్వాత కేవలం అయిదు, పది నిమిషాల్లోనే ఆ దేశంలోకి అడుగుపెట్టవచ్చు. అమెరికా చేపట్టిన గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్‌లోకి భారత్‌ను అధికారికంగా చేర్చుకోవడంతో ఇందుకు మార్గం సుగమం అయింది. ‘ఇంటర్నేషనల్ ఎక్స్‌పెడిటెడ్ ట్రావెలర్ ఇనిషియేటివ్’గా పిలవబడే ఈ ప్రోగ్రామ్‌లో భారత్ చేరడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతిస్తూ, దీనివల్ల అమెరికా, భారతీయ ప్రజల మధ్య మరింత సన్నిహిత వ్యాపార, విద్యా సంబంధాలు నెలకొనేందుకు వీలవుతుందని పేర్కొన్నట్లు ట్రంప్, మోదీ మధ్య ద్వైపాక్షిక చర్చల అనంతరం విడుదల చేసిన భారత్-అమెరికా సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్‌లో స్విట్జర్లాండ్, బ్రిటన్‌లున్నాయి. ఇప్పుడు భారత్ దీనిలో చేరింది. అమెరికాలోకి అడుగు పెట్టిన తర్వాత ముందుగా ఆమోదించిన, లోరిస్క్ ప్రయాణికులకు సత్వర క్లియరెన్స్ లభించడం కోసం అమెరికా కస్టమ్స్, సరిహద్దు రక్షణ (సిబిపి) అమలు చేస్తున్న కార్యక్రమమే ఈ గ్లోబల్ ఎంట్రీ. ఎంపిక చేసిన విమానాశ్రయంలో దిగిన వెంటనే ఈ ప్రోగ్రామ్ సభ్యులు ఇమిగ్రేషన్ క్లియరెన్స్ కోసం క్యూలో నిలబడకుండా ప్రత్యేక ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ కౌంటర్ల ద్వారా అమెరికాలోకి ప్రవేశిస్తారు. ఈ విమానాశ్రయాల్లో వారు నేరుగా గ్లోబల్ ఎంట్రీ కౌంటర్ల వద్దకు వెళ్లి అక్కడ మెషిన్లు చదవగలిగిన తమ పాస్‌పోర్టును కానీ, అమెరికా పర్మనెంట్ రెసిడెంట్ కార్డును కానీ సమర్పించి, వేలిముద్రల వెరిఫికేషన్ కోసం స్కానర్‌పై తమ వేలిముద్రలు ఉంచి, కస్టమ్స్ డిక్లరేషన్‌ను పూర్తి చేస్తారు. ఇదంతా అయిదు, పది నిమిషాల్లోనే పూర్తయి పోతుంది. అప్పుడు ఆ కౌంటర్‌లోని వారు ఆ ప్రయాణికుడికి ఒక ట్రాన్సాక్షన్ రసీదును అందజేసి తన బ్యాగేజి తీసుకుని బైటికి వెళ్లడం కోసం బ్యాగేజి క్లెయమ్‌కు వెళ్లమని చెప్తారు. అయితే ఈ గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్‌కు ప్రయాణికులు ముందుగా అప్రూవ్ అయిన వారయి ఉండాలి. దీనిలో చేరడానికి ముందు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలన్నిటినీ లోతుగా చెక్ చేసుకున్న తర్వాత వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ చేస్తారని సిబిపి వెబ్‌సైట్‌లో ఉంచిన వివరాలను బట్టి తెలుస్తోంది. న్యూయార్క్, వాషింగ్టన్, ఆస్టిన్, డల్లాస్, హ్యూస్టన్, బోస్టన్, చికాగో, శాన్‌ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిల్స్, లాస్ వేగాస్, మియామి, సీటెల్ లాంటి అన్ని ప్రధాన అమెరికా విమానాశ్రయాల్లోను ఈ గోల్డెన్ ఎంట్రీ సదుపాయం ఉంది. అంతేకాకుండా ఐర్లాండ్‌లోని డబ్లిన్, కెనడాలోని టొరాంటో, అబూధాబి విమానాశ్రయాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

చిత్రం.. ఏకాంత చర్చల కోసం ప్రధాని మోదీని రోజ్‌గార్డెన్ వైపు సాదరంగా తీసుకొని వెళ్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్