అంతర్జాతీయం

ఆలింగనాలు.. పొగడ్తలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 27: ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కలుసుకొన్నది తొలిసారే అయినప్పటికీ వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందనే విషయం వైట్‌హౌస్‌లో వారి భేటీలో చాలా స్పష్టంగా కనిపించింది. మోదీకి ట్రంప్ దంపతులు స్వాగతం చెప్పడం మొదలుకొని ఆయన హోటల్‌కు తిరిగి వెళ్లేటప్పుడు వీడ్కోలు పలికే దాకా కరచాలనాలు, ఆత్మీయ ఆలింగనాలు, పలకరింపులు.. ఇవన్నీ ఆ విషయాన్ని చెప్పకనే చెప్పాయి. ఇక ఇరువురు నేతలు ఒకరిపై పొగడ్తల వర్షం కురిపించుకోవడమే కాక నాయకత్వ లక్షణాలను ప్రశంసించుకున్నారు. ద్వైపాక్షిక, ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం ఇరువురు నేతలు చేసిన సంయుక్త పత్రికా ప్రకటనలో ఈ విషయం స్పష్టమవుతుంది. భారత్‌కు వైట్‌హౌస్ నిజమైన మిత్రుడిలాంటిదని, రెండు దేశాల మధ్య స్నేహం ప్రజాస్వామ్యం లాంటి రెండు దేశాలు కట్టుబడిన విలువల ఆధారంగా నిర్మాణమైందని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తాను గెలిస్తే వైట్‌హౌస్‌లో భారత్ నిజమైన మిత్రుడ్ని చూడవచ్చని ఎన్నికల ప్రచారం సందర్భంగా తాను హామీ ఇచ్చానని, ఇప్పుడది నిజమైందని ట్రంప్ అన్నారు. ‘మీరు, మీ దేశ ప్రజలు సాధించిన విజయాలు చూసి తాను ముగ్ధుడినయ్యా’ని ఆయన మోదీని ఉద్దేశించి అన్నారు. కాగా ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి ట్రంప్ కృతనిశ్చయంతో ఉండడాన్ని తాను ఎంతగానో అభినందిస్తున్నానని తన వంతుగా మోదీ అన్నారు. ‘మీ నాయకత్వంలో పరస్పరం ప్రయోజనకరమైన మన వ్యూహాత్మక సంబంధాలు కొత్త బలాన్ని సంపాదించుకుని, సరికొత్త శిఖరాలకు చేరుకుంటాయని, అలాగే వ్యాపారంలో మీకున్న అపారమైన అనుభవం మన సంబంధాలకు ఓ సరికొత్త అజెండాను అందిస్తుందని నేను గట్టి నమ్మకంతో ఉన్నాను’ అని కూడా మోదీ అన్నారు. అభివృద్ధి దిశగా మన రెండు దేశాల ఉమ్మడి ప్రయాణంలో తాను ఒక కృతనిశ్చయం కలిగిన, నిర్ణయాత్మక, భాగస్వామిగా ఉంటానని ఈ సందర్భంగా మోదీ హామీ ఇచ్చారు.
ట్రంప్ తన ప్రసంగాన్ని ముగించిన తర్వాత మోదీ ఆయన వైపు వెళ్లి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అలాగే మోదీ తన హోటల్‌కు బయలుదేరినప్పుడు వైట్‌హౌస్ పోర్టికో వద్ద మరోసారి ట్రంప్ ప్రధానిని ఆలింగనం చేసుకుని వీడ్కోలు చెప్పారు. మోదీ వైట్‌హౌస్‌లో గడిపినంత సేపు ఇరువురు నేతలు తామెంతో సన్నిహితులమనే విధంగానే ప్రవర్తించారు. తొలి సమావేశంలోనే ఇరువురు నేతలు ఎలాంటి అరమరికలు లేకుండా వ్యవహరించారని, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్ జైశంకర్ వ్యాఖ్యానించడం గమనార్హం.
మోదీ, ట్రంప్ మధ్య ద్వైపాక్షిక సమావేశం ముందు 20 నిమిషాలు మాత్రమే జరగాల్సి ఉండగా 40 నిమిషాల పాటు కొనసాగడం గమనార్హం. అలాగే ప్రతినిధి స్థాయి చర్చలు సైతం దాదాపు గంట సేపు కొనసాగాయి. ఫలితంగా ఇరువురు నేతల సంయుక్త ప్రకటన ఆలస్యం అయింది కూడా. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మోదీల మధ్య కూడా ఇదే రకమైన సాన్నిహిత్యం కొనసాగింది. అలాగే అధ్యక్ష హోదాలో ట్రంప్ ఇదివరకు తొలిసారిగా కలిసిన ప్రపంచ నేతల భేటీల్లోను ఇలాంటి సుహృద్భావ ధోరణి వ్యక్తం కాకపోవడం గమనార్హం.

చిత్రం.. వైట్‌హౌస్‌లో ట్రంప్, మోదీ ఛలోక్తులు...
చిరునవ్వుతో తిలకిస్తున్న అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్