అంతర్జాతీయం

మా అణు కార్యక్రమం పరిమితమైనదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 1: తమ అణు కార్యక్రమం భారత్ అంత భారీస్థాయిది కాదని, అంతేకాకుండా ప్రమాదం జరిగే అవకాశం లేనిది కూడానని పాక్ చెప్పుకొంది. పాక్ అణ్వాయుధాల భద్రతపై ప్రపంచ వ్యాప్తంగా భయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ దేశం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ( ఐఏఇఏ) ప్రఫంచవ్యాప్తంగా2,734 అణు ప్రమాదాలను రికార్డు చేసిందని, వాటిలో భారత్‌లో జరిగిన అయిదు ప్రమాదాలు కూడా ఉన్నాయని, అయితే తమ అణు కార్యక్రమం ప్రారంభమై నలభై ఏళ్లయినప్పటికీ పాకిస్తాన్‌లో ఒక్క ప్రమాదం కూడా జరగలేదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అణు భద్రతపై ఏర్పాటు చేసిన శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడం కోసం వాషింగ్టన్ వచ్చిన పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శి అజీజ్ చౌదరి చెప్పారు. దేశ ప్రజల పూర్తి యాజమాన్యంతో పరిమిత స్థాయి అణు కార్యక్రమాన్ని పాక్ కలిగి ఉందని, ముఖ్యంగా ఆత్మ రక్షణ కోసమే తప్ప ఎవరినీ భయపెట్టేందుకు ఈ అణు కార్యక్రమాన్ని కొనసాగించడం లేదని వాషింగ్టన్‌లోని పాక్ దౌత్య కార్యాలయం వద్ద విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. పాకిస్తాన్ అణు వ్యవస్థలు భద్రమైనవే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఆ విషయా న్ని గుర్తించాయని ఆయన చెప్పారు. తమ అణు వ్యవస్థలు భద్రంగా ఉండేలా చూడడం కోసం పాక్ చాలా శ్రమిస్తోందని కూడా ఆయన చెప్పారు. మరోవైపు భారత్ భారీ ఎత్తున అణు కార్యక్రమాన్ని, అంతే స్థాయిలో సంప్రదాయ ఆయుధ సేకరణ కార్యక్రమాన్ని సైతం కొనసాగిస్తోందని ఆయన చెప్పారు. పరిమిత స్థాయి అణు కార్యక్రమమే తమకు ఉందని, ఎందుకంటే ఆత్మరక్షణ చేసుకునే హక్కు తమకు ఉందని తాము భావిస్తున్నామని చౌదరి చెప్పారు. పాక్ వద్ద షార్ట్ రేంజ్, లాంగ్ రేంజ్ క్షిపణులున్నాయని, ఈ రెండింటి వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం శత్రువుల దాడిని తిప్పి కొట్టడమేనని ఆయన చెప్పారు. తమ అణు వ్యవస్థలు భద్రంగా ఉండేలా చూడడం కోసం పాకిస్తాన్ ప్రపంచ దేశాలతో కలిసి పని చేస్తోందని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి అధ్యక్షతన కల జాతీయ కమాండ్ అథారిటీ చేతిలో తమ అణు వ్యవస్థలు పూర్తి భద్రంగా ఉన్నాయని కూడా ఆయన చెప్పారు. పాకిస్తాన్ శరవేగంగా పెరుగుతున్న అణు కార్యక్రమాన్ని కలిగి ఉందని మీడియాలో సృష్టించిన భావన తప్పని, నిజానికి తమకన్నా భారతే పెద్ద అణు కార్యక్రమాన్ని కలిగి ఉందని పలు అధ్యయనాలు రుజువు చేశాయని కూడా చౌదరి చెప్పారు. భారత్‌నుంచి ఎదురయ్యే ముప్పుతో పాక్ సన్నద్ధత ముడిపడి ఉందని, దానికి అనుగుణంగానే నిరోధం ఉంటుందని ఆయన అన్నారు.