అంతర్జాతీయం

చారిత్రక పాఠాలు నేర్చుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జూన్ 29: సరిహద్దు సమస్యను అర్ధవంతంగా పరిష్కరించుకోవాలంటే సిక్కింలోని డోంగ్లాంగ్ నుంచి భారత్ తన సైనిక దళాలను వెనక్కితీసుకోవాలని చైనా గురువారం స్పష్టం చేసింది. సరిహద్దు సమస్యపై చర్చలకు దీన్ని ముందస్తు షరతుగా విధించింది. 1962లో జరిగిన యుద్ధాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ‘్భరత్ సైనిక దళాలు చారిత్రక పాఠాలు నేర్చుకోవాలి’అని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లూకంగ్ తెలిపారు. డోంగ్లాంగ్ ప్రాంతంలోకి భారత దళాలు చొరబడ్డాయంటూ ఓ ఫొటోను కూడా చూపించారు. ఈ ప్రాంతం నుంచి భారత సైన్యం వైదొలిగితేనే తదుపరి ఉద్రిక్తతలకు తావులేకుండా సమస్యను సామరస్యపూరకంగా పరిష్కరించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. భారత దళాల చొరబాటు జరిగినప్పటి నుంచి తాము అనేక సార్లు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ఈ ఫొటోను తమ విదేశాంగ మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో ప్రచారం చేస్తామన్నారు. తక్షమే భారత్ తన సైనిక బలాలను ఉపసంహరించుకోవాలని అన్నారు. దీని ప్రాతిపదికగానే తదుపరి చర్చలు జరిగేందుగు ఆస్కారం ఉంటుందని చెప్పారు. ఇలా ఉండగా డోంగ్లాంగ్ ప్రాంతంలోని తమ భూ భాగంలోకి చైనా సైనిక దళాలు ప్రవేశించాయంటూ భూటాన్ చేసిన ఆరోపణలను చైనా రక్షణశాఖ ప్రతినిధి వూక్యాన్ తిరస్కరించారు. చైనా దళాలు తమ దేశానికి చెందిన ప్రాంతంలోనే ఉన్నాయని దాన్ని అతిక్రమించలేదని తెలిపారు. అదే విధంగా భారత్ తన తప్పిదాలను దిద్దుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు. సిక్కింలోని డోంగ్లాంగ్‌లోగల చైనా భూ భాగంలోకి భారత దళాలు ప్రవేశించాయని చైనా సైనిక ప్రతనిధి కూడా తీవ్రంగా ఆరోపించారు. తమ సార్వభౌమత్యాన్ని, ప్రాదేశిక సమగ్రతను ఎట్టిపరిస్థితుల్లోనూ కాపాడుకుంటామని తెలిపారు. తప్పును సరిదిద్దుకుని ఈ ప్రాంతం నుంచి వైదొలగాలంటూ భారత్ దళాలను గట్టిగా కోరడం జరిగిందని ఆయన అన్నారు.