అంతర్జాతీయం

ఐసిస్ రాజ్యం కూలిపోయింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోసుల్, జూన్ 29: ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ సంస్థ మూడేళ్ల క్రితం తమ సొంత దేశాన్ని ప్రకటించుకున్న మోసుల్‌లోని చరిత్రాత్మక అల్-నూరి మసీదును ఇరాక్ ప్రభుత్వ దళాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయని ఇరాక్ సైన్యం గురువారం ప్రకటించింది. దాదాపు 850 ఏళ్లనాటి ఈ సువిశాలమైన మసీదును హస్తగతం చేసుకోవడంతో ఇరాక్‌లో ఐసిస్‌కు అనధికారిక రాజధానిగా కొనసాగుతున్న మోసుల్ పట్టణాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఎనిమిది నెలలుగా పోరాడుతున్న ఇరాకీ సైన్యాలకు ఒక విధంగా ఐసిస్‌పై విజయం లభించినట్లయింది. ‘వారి కల్పిత ప్రభుత్వం కుప్పకూలిపోయింది’ అని ఇరాకీ సైన్యం ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యాహ్యా రసూల్ ఐసిస్‌నుద్దేశించి ప్రభుత్వ టెలివిజన్‌తో అన్నారు. అమెరికా మద్దతున్న ఇరాకీ సైన్యాలు మోసుల్ మసీదు దిశగా ముందుకు చొచ్చుకువస్తూ ఉండడంతో వారం రోజుల క్రితం ఐసిస్ మిలిటెంట్లు ఈ ప్రాచీన మసీదును, ఒక వైపునకు వాలి ఉన్న దాని స్తంభాన్ని పేల్చి వేశారు.