అంతర్జాతీయం

చైనా భారీ రాకెట్ ప్రయోగం విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జూలై 2: అత్యంత బరువైన ఉపగ్రహాన్ని మోసుకెళ్లే ‘లాంగ్ మార్చ్-5వై 2’రాకెట్‌ను ప్రయోగించడానికి చైనా ఆదివారం జరిపిన రెండో ప్రయత్నం విఫలమైంది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 7.23 గంటలకు హైనాన్ రాష్ట్రంలోని వెన్‌చాంగ్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంనుంచి ఈ రాకెట్‌ను ప్రయోగించిన తర్వాత సాంకేతిక లోపాన్ని గుర్తించినట్లు అధికార వార్తాసంస్థ జిన్హువా తెలిపింది. ఇప్పటివరకు చైనా ప్రయోగించిన ఉపగ్రహలన్నిటిలోకి అత్యంత బరువైన షిజియాన్-18 ఉపగ్రహాన్ని ఈ రాకెట్ మోసుకెళ్లాల్సి ఉంది. దాదాపు 7.5 టన్నుల బరువుండే ఈ ఉపగ్రహం చైనా ప్రయోగిస్తున్న అత్యాధునిక టెక్నాలజీ ఉపగ్రహం కావడం గమనార్హం. ఈ ఏడాది ద్వితీయార్ధంలో చంద్రుడిపైకి ‘చాంగె-5’ ప్రోబ్(మానవ రహిత ఉపగ్రహం)ను పంపించడానికి ముందు లాంగ్ మార్చ్-5 సిరీస్‌లో జరుపుతున్న ఈ చివరి ప్రయోగం విఫలం కావడం విశేషం. 2016 నవంబర్‌లో తొలిసారిగా లాంగ్‌మార్చ్-5 రాకెట్ ప్రయోగం జరిగింది. ఇది భూ స్థిరకక్ష్యలోకి 14 టన్నుల పేలోడ్‌లను తీసుకెళ్లగలదు.