అంతర్జాతీయం

సిరియాలో పేలిన కారుబాంబులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డమాస్కస్, జూలై 2: అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియా రాజధాని డమాస్కస్‌లో ఆదివారం కారుబాంబులతో దద్దరిల్లింది. కారుబాంబర్లను గుర్తించిన భద్రతా బలగాలు వెంటాడుతున్న సమయంలోనే రెండు కారు బాంబులు పేలి 18మంది దుర్మరణం చెందారు. వీరిలో ప్రభుత్వ అనుకూల బలగాలకు చెందిన ఏడుగురితో పాటు మరో ఇద్దరు పౌరులు ఉన్నారు. మిగిలినవారిని ఇంకా గుర్తించలేదు. అంతర్యుద్ధంతో అల్లాడుతున్న సిరియాలో ఇటీవలి కాలంలో జరిగిన అతి పెద్ద దాడి ఇదే. ఆదివారం ఉదయం మూడు కార్లలో ఆత్మాహుతి బాంబర్లు సంచరిస్తున్నారన్న సమాచారం అందుకున్న బలగాలు వారిని వెంబడిస్తుండగానే ఇద్దరు డ్రైవర్లు తమను తాను పేల్చేసుకున్నారు. మూడింటిలో రెండు కార్లు నగర శివారు ప్రాంతంలోనే పేలిపోయాయి. మూడో కారులో ఆత్మాహుతి బాంబర్ తహ్రీర్ స్క్వేర్‌లోని తూర్పు ప్రాంతానికి చేరుకున్నా బాంబు పేల్చడంలో విఫలం కావడం, బలగాలు చుట్టుముట్టడంతో తనను తాను తుపాకితో కాల్చుకున్నాడు. ఈ కారు బాంబు పేలుళ్లలో పలువురు పౌరులు ప్రాణాలు కోల్పోడంతో పాటు చాలామంది గాయపడ్డారని, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం వాటిల్లిందని స్థానిక అధికారులు తెలిపారు. పేలుళ్ల ధాటికి సమీప ప్రాంతంలో భవనాలు దెబ్బతినడంతో పాటు పలువురికి గాయాలయ్యాయి. తిరుగుబాటుదారులకు ప్రభుత్వానికి మధ్య గత మే నెలలో ఒప్పందం కుదిరిన అనంతరం ప్రశాంతంగా ఉన్న సిరియా తాజా దాడితో మరోసారి ఉలిక్కిపడింది. 2011లో మొదలైన అంతర్యుద్ధంలో ఇప్పటివరకు మూడులక్షల 20వేల మందికి పైగా దుర్మరణం చెందారు.

చిత్రం..సిరియాలోని తహ్రీర్ స్క్వేర్‌లో ఆదివారం జరిగిన పేలుళ్లలో ధ్వంసమైన వాహనాలు