అంతర్జాతీయం

రష్యా రోడ్డు ప్రమాదంలో 14మంది సజీవదహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, జూలై 2: రష్యాలో ఓ బస్సు ప్రమాదానికి గురై 14మంది సజీవదహనమయ్యారు. తతర్‌స్తాన్ రిపబ్లిక్‌లో ప్రయాణికులతో ఉన్న ఓ బస్సు ట్రక్కును ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో 14మంది అక్కడికక్కడే చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. బస్సు మంటల్లో చిక్కుకున్న దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డయిందని, ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు వారు తెలిపారు. కాగా, ఆదివారం ఉదయం జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. తూర్పు మాస్కోలోని నిజ్నీ నోవ్‌గొరోడ్ నగర శివారులో ఓ కారు చెట్టును ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. బ్య్రాన్‌స్క్ సిటీలో ఓ బస్టాప్ వద్ద నిలబడిన ఇద్దరు టీనేజర్లపైకి ట్రక్కు దూసుకుపోవడంతో వారిద్దరూ దుర్మరణం చెందారు. అభద్రతకు నిలయాలుగా మారిన రష్యా రహదారులు గత ఏడాది 20వేలమందిని పైగా బలిగొన్నాయి.

చిత్రం..ట్రక్కు ఢీకొనడంతో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన బస్సు