అంతర్జాతీయం

జాధవ్‌కు క్షమాభిక్ష పెట్టొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, జూలై 3: కుల్‌భూషణ్ జాధవ్‌కు క్షమాభిక్ష పెట్టొద్దని, అతనికి విధించిన ఉరి శిక్షను వెంటనే అమలు చేయాలని మహమూద్ అహ్మద్ నఖ్వీ అనే పౌరుడు లాహోర్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. పాక్‌లో విధ్వంసం సృష్టించేందుకు కుట్రపన్నానని జాధవ్ తన నేరాన్ని అంగీకరించాడని ఇక ఆలస్యం చేయకుండా అతనికి విధించిన మరణశిక్ష అమలు చేయాలని పిటిషనర్ కోరాడు. జాధవ్‌పై ఎటువంటి కరుణ చూపకుండా కోర్టు ఆదేశాలు జారీ చేయాలని కోరాడు. తాను సెలవుపై వెళుతున్నానని, ఈ పిటిషన్‌ను విచారించడానికి మరో బెంచ్‌ని ఏర్పాటు చేయాల్సిందిగా చీఫ్ జస్టిస్‌కు న్యాయమూర్తి షాహిద్ కరీం విన్నవించారు. గూఢచర్యం, విధ్వంస రచన తదితర ఆరోపణలపై భారత్‌కు చెందిన కుల్‌భూషణ్ జాధవ్‌కు పాకిస్తాన్ మిలిటరీ కోర్టు మరణ శిక్ష విధించిన విషయం తెలిసిందే.