అంతర్జాతీయం

మొసోల్‌లో ఐసిస్ ఘాతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొసోల్, జూలై 3: అంతమైపోయిందనుకున్న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ మళ్లీ జడలువిప్పింది. ఐసిస్ కంచుకోటగా కొనసాగిన మొసోల్ ఇరాక్ దళాల వశమైన నేపథ్యంలో ఇక రెండో ప్రధాన పట్టణాన్ని స్వాధీనం చేసుకునేందుకు దళాలు సిద్ధమవుతున్న తరుణంలో ఐసిస్ ఉగ్రవాద సంస్థ ఆత్మాహుతి బాంబర్లతో రక్తాన్ని చిందించింది. రెండో అతి పెద్ద పట్టణమైన అంబార్‌ను స్వాధీనం చేసుకునేందుకు ఇరాకీ దళాలు ప్రయత్నిస్తున్న తరుణంలో ఐసిస్ ఈ దాడులకు పాల్పడింది. దాడుల్లో 15మంది మరణించినట్టుగా అధికార వర్గాలు తెలిపాయి. మొసోల్ నుంచి ఐసిస్‌ను తరిమేసినా, ఇంకా దాని ఆధీనంలోవున్న అనేక ప్రాంతాలు ప్రభుత్వానికి ఎన్నో సవాళ్లు విసురుతున్నాయని అధికారులు తెలిపారు. మొసోల్ పాత పట్టణంగా భావిస్తోన్న అంబార్‌లో ఐసిస్ ఉగ్రవాదులు మహిళలుగా బురఖాలు ధరించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని అధికార వర్గాలు తెలిపాయి.