అంతర్జాతీయం

18 మంది సజీవ దహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెర్లిన్, జూలై 3: జర్మనీలోని బవారియా హైవేపై సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు జర్మనీలోని సాక్సోని నుంచి సీనియర్ సిటిజన్స్‌తో వస్తున్న బస్సును ట్రక్ ఢీకొన్న ఘటనలో 18మంది సజీవ దహనమయ్యారు. ప్రమాదంలో మరో 30మంది తీవ్రంగా గాయపడినట్టు తెలిపారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే సమీప ప్రాంతాల నుంచి అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. మంటలను అదుపు చేసేందుకు ఎంత ప్రయత్నించినా, ఫలితం లేకపోయింది. అనేకమంది ప్రయాణికుల శరీరాలు పూర్తిగా కాలిపోవడంతో, వారిని గుర్తించేందుకు ఫోరెన్సిక్ నిపుణులను తీసుకొచ్చారు. శరీరాలు గుర్తుపట్టలేనంతంగా కాలిపోవడంతో, సహాయక చర్యలు చేపట్టడం కష్టంగా మారిందని పోలీస్ అధికార ప్రతినిధి ఇరేన్ బ్రాండెస్టెయిన్ తెలిపారు. ‘ప్రమాదంపై దర్యాప్తు చేపట్టడమే కష్టంగా ఉంది. దీనిపై వెంటనే ఒక నిర్ణయానికి రాలేం’ అని ఆమె పేర్కొన్నారు. ఘోర ప్రమాదం కారణంగా ఏ9 హైవేపై భారీగా ట్రాఫిక్ స్థంభించింది. దీంతో హైవేను రెండు వైపులా మూసివేసి, వాహనాలను మరో మార్గంలో మళ్లించారు.