అంతర్జాతీయం

ఉగ్రపోరులో భారత్‌కు పూర్తి మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెరూసాలెం, జూలై 4: పాకిస్తాన్‌నుంచి ఎదురవుతున్న ఉగ్రవాదంపై భారత్ సాగిస్తున్న పోరుకు తమ దేశం పూర్తి మద్దతునిస్తుందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మార్క్ సోఫర్ అన్నారు. ఉగ్రవాద ముప్పునుంచి దేశాన్ని రక్షించుకోవడంలో భారత్‌కు పూర్తి హక్కు ఉందని ఆయన పేర్కొన్నారు. మా దేశంలో హమస్ వంటిదే లష్కరే తోయిబా అని, ఇరు దేశాలు ఉగ్రవాద ముప్పును ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు. బయటినుంచి గానీ దేశీయంగా గానీ ఉగ్రవాదుల చర్యలను కట్టడి చేయాల్సిందేనని సోఫర్ చెప్పారు. తమ దేశం కూడా భారత్‌లాగానే సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోందని, ఉగ్ర రక్షసి నుంచి తమను తాము ఈ రెండు దేశాలు కాపాడుకోడానికి కృషి చేస్తున్నాయని అన్నారు. ఈ విషయంలో భారత్‌ను సమర్థించడంలో ఇజ్రాయెల్ ఎప్పుడూ ముందుందని చెప్పారు. సంకుచిత, విధ్వంసకర ఆలోచనా ధోరణి, పనికిరాని సిద్ధాంతాలతో అమాయకులను హతమార్చే ఉగ్రవాది ఎక్కడైనా, ఏ దేశంలోనైనా ఉగ్రవాదేనని అన్నారు. ఏ రూపంలో ఉన్నా ఉగ్రభూతాన్ని మట్టుబెట్టడం తక్షణ కర్తవ్యమని పేర్కొన్నారు. సోఫర్ గతంలో భారత్‌లో ఇజ్రాయెల్ రాయబారిగా పనిచేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటనకు ఇజ్రాయెల్ వచ్చిన సందర్భంగా సోఫర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

చిత్రం.. మంగళవారం ఇజ్రాయెల్ చేరిన ప్రధాని నరేంద్ర మోదీకి టెల్‌అవీవ్
ఎయర్ పోర్టులో స్వాగతం పలుకుతున్న ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు