అంతర్జాతీయం

‘లిటిల్ కబ్’లో అంతరిక్ష రహస్యాలెన్నో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 4: విశ్వం ఏర్పడిన తొలినాళ్లకు చెందిన ఓ చిన్ని గెలాక్సీని అంతరిక్ష పరిశోధకులు కొత్తగా కనుగొన్నారు. బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం విస్ఫోటనం తర్వాత అనేకానేక గెలాక్సీలలాగా ఈ చిన్ని గెలాక్సీ లిటిల్ కబ్ కూడా ఏర్పడింది. భూమికి కేవలం 50 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ లిటిల్ కబ్ నక్షత్ర మహాకూటమి ఉర్షా మేయర్‌పైన ఉందని గుర్తించారు. దీనినుంచి నక్షత్రాలు ఏర్పడడానికి అవసరమైన గ్యాస్ వెలువడుతోంది. ఈ గ్యాస్‌ను అధ్యయనం చేస్తే అసలు విశ్వం ఎలా ఆవిర్భవించిందన్న రహస్యాలు ఎన్నో వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో అంతరిక్ష పరిశోధనలు చేస్తున్న బృందం పేర్కొంది. ఓ చిన్న గెలాక్సీ మరోపెద్ద గెలాక్సీ వైపుగా వెళుతున్నప్పుడు ఇలా నక్షత్రాలు ఏర్పడడానికి అవసరమైన గ్యాస్‌ను విడుదల చేయడం ఓ అరుదైన సంఘటన అని బృందంలోని సభ్యుడు టిపానీ స్యూ తెలిపారు. ఈ సమయంలో నక్షత్రాలు ఎలా ఏర్పడతాయో అధ్యయనం చేయడానికి ఓ మంచి అవకాశముంటుందని పేర్కొన్నాడు. అతిపెద్ద గెలాక్సీ అయిన ఎన్‌జిసి 3359తో కలిసేప్పుడు లిటిల్ కబ్‌లో ఉండే గ్యాస్ అంతా ఖాళీ అయిపోతుంది. లిటిల్ కబ్‌కంటే ఎన్‌జిసి 3359లో పదివేల రెట్లు ఎక్కువగా నక్షత్రాలున్నాయి. ఒక్కసారి చిన్న గెలాక్సీలు పెద్ద గెలాక్సీలలో కలిసిపోతే అవి నక్షత్రాలను తయారు చేసే శక్తి సామర్థ్యాలను కోల్పోతాయి. అనంతరం అవి అంతమైపోతాయి. లిటిల్ కబ్‌లోని అత్యంత కాంతివంతమైన చిన్నచిన్న నక్షత్రాలలోని హైడ్రోజన్, హీలియం అణువులపై పరిశోధనలు చేసే వీలుంటుంది. వీటిద్వారా ఎన్నో విశ్వరహస్యాలు ఛేదించే అవకాశాలున్నాయని పరిశోధకులు పేర్కొంటున్నారు.