అంతర్జాతీయం

భూగోళాన్ని ప్రమాదం అంచుల్లోకి నెట్టేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 4: పారిస్ పర్యావరణ ఒడంబడికనుంచి వైదలగాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో భూగోళం తీవ్ర ప్రమాదంలో పడనుందని, శుక్రగ్రహంలాగా అత్యంత వేడి కలిగిన గ్రహంగా మారిపోయే ప్రమాదం ఉందని ప్రముఖ బ్రిటిష్ భౌతిక శాస్తవ్రేత్త స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించారు. పారిస్ ఒప్పందం అమెరికా వాణిజ్య సంస్థల ప్రయోజనాలకు హాని కలిగించేదిగా ఉందని అన్నారు. అనేక సంవత్సరాల సుదీర్ఘ చర్చల అనంతరం కర్బన ఉద్గారాలను అదుపు చేయడంద్వారా పర్యావరణ పరిరక్షణకు పారిస్‌లో ప్రపంచ దేశాల మధ్య కుదిరిన ఒప్పందంపై 200కు పైగా దేశాలు ఇప్పటికే సంతకాలు చేశాయి. అయితే పారిస్ ఒప్పందంనుంచి వైదొలగాలన్న ట్రంప్ నిర్ణయం కారణంగా వాతావరణ మార్పు తిరిగి పూర్వస్థితికి తీసుకురాలేనిదిగా చేస్తుందని బిబిసికిచ్చిన ఓ ఇంటర్వ్యూలో హాకింగ్ అన్నారు. ‘్భతాపం పూర్వస్థితికి తీసుకురాలేని పరిస్థితికి అత్యంత చేరువలో మనం ఉన్నాం. ట్రంప్ చర్య భూగోళాన్ని ఆ ప్రమాదం అంచులకు తీసుకెళ్తుంది. 250 డిగ్రీల సెల్సియస్ వేడి, గంధక ఆమ్ల వర్షాలు ఉండే శుక్రగ్రహంలాగా మారిపోయేలా చేస్తుంది’ అని 75 ఏళ్ల ప్రపంచ ప్రసిద్ధి చెందిన శాస్తవ్రేత్త అయిన హాకింగ్ అన్నారు. మానవాళి ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన ముప్పుల్లో పర్యావరణ మార్పు ఒకటని, అయితే ఇప్పుడే స్పందించడంద్వారా దాన్ని నివారించవచ్చని ఆయన అభిప్రాయ పడ్డారు. ‘వాతావరణ మార్పులకు సాక్ష్యాధారాలను కాదనడంద్వారా, పారిస్ ఒప్పందంనుంచి వైదొలగడం ద్వారా డొనాల్డ్ ట్రంప్ అందమైన ఈ భూగోళానికి, మనకు, మన పిల్లలకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తున్నారు’ అని హాకింగ్ అన్నారు. మానవాళి పర్యావరణ పరంగా ఎదురయ్యే సమస్యలను, ఘర్షణలను ఎప్పటికీ పరిష్కరించుకోలేదా అని అడగ్గా, భూమిపై మనిషి మనుగడకు రోజులు దగ్గర పడుతున్నాయని తాను భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ‘పరిణామక్రమం మనిషిలోకి దురాశను, దూకుడును చొప్పించాయి. ఘర్షణలు తగ్గే సూచనలు ఏమీ కనిపించడం లేదు. జన హనన ఆయుధాల అభివృద్ధిలాంటి వాటి వల్ల ఆ ఘోరమైన పరిస్థితి తప్పదనిపిస్తోంది. రోదసిలో స్వతంత్ర కాలనీల ఏర్పాటుద్వారా మాత్రమే మానవాళి మనుగడ సాధ్యమవుతుందని నేను అనుకుంటున్నా’ అని హాకింగ్ చెప్పారు. యూరోపియన్ యూనియన్‌నుంచి బ్రిటన్ వైదొలగడం గురించి అడగ్గా, బెగ్జిట్‌వల్ల బ్రిటిష్ సైన్స్ ఏకాకిగా మారే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.