అంతర్జాతీయం

ఆధార్ అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హ్యాంబర్గ్, జూలై 6: భారతీయ ఆధార్‌కు అంతర్జాతీయ గుర్తింపు, ప్రశంస లభించింది. ఆర్థిక సమీకృత వ్యవస్థను పాదుగొల్పేందుకు ప్రపంచ దేశాలన్నీ తంటాలు పడుతున్న తరుణంలో భారత ప్రభుత్వం ఆధార్ ద్వారా ప్రజలందరినీ ఆర్థిక ప్రక్రియలో అనుసంధానం చేయడం అద్భుతమని అంతర్జాతీయ ఆర్థిక సంస్కరణల సంస్థ ఎఫ్‌ఎస్‌బి కితాబిచ్చింది. తక్కువ నగదు వినియోగంతో పాటు అత్యధిక స్థాయిలో ప్రజానీకానికి బ్యాంకింగ్ సేవల్ని ఆధార్ అనుసంధానత ద్వారా భారత ప్రభుత్వం అందించగలిగిందని తెలిపింది. బయోమెట్రిక్ టెక్నాలజీ, కేంద్రీకృత డేటాబేస్‌ను భారత్ ఆర్థిక సమీకృత లక్ష్య సాధన కోసం వినియోగిస్తోందని, దీని వల్ల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఎన్నో సమస్యలు తొలగిపోతాయని వివరించింది. ఆర్థిక సంస్కరణలు, సుస్థిరత, నిజాయితీ తదితర అంశాలకు సంబంధించి ఓ సమగ్ర నివేదికను రూపొందించిన ఈ సంస్థ శుక్రవారం జరుగనున్న జి-20 సదస్సుకు నివేదించింది.