అంతర్జాతీయం

వృద్ధిలో చైనాను మించిపోనున్న భారత్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, జూలై 6: భారత్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి దిశగా దూసుకుపోతోంది. భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక గమనానికి చుక్కానిలా నిలుస్తుందని హార్వార్డ్ యూనివర్సిటీ అధ్యయన బృందం తాజా నివేదికలో పేర్కొంది. ప్రపంచ దేశాలన్నీ మందగమనంలో ఉంటే భారత్, ఉగాండా మాత్రం అతివేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపింది. రానున్న దశకంలో ప్రపంచ ఆర్థిక గమనం మందగిస్తుదని అయినప్పటికీ భారత్ మాత్రం అభివృద్ధి దిశగా దూసుకుపోతుందని పేర్కొంది. అభివృద్ధిలో చైనాను వెనక్కి నెట్టి భారత్ ముందుకు సాగిపోతుందని, రానున్న దశకంలో చైనాను మించిపోతుందని అధ్యయనం వెల్లడించింది. రసాయనాలు, యంత్రాలు, ఎలక్ట్రానిక్స్ ఇలా అనేక విభిన్న రంగాల్లో ఎగుమతులను ప్రోత్సహించడంద్వారా కొత్త కొత్త రంగాల్లో భారత్ అడుగుపెట్టి చాలావేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొంది. అదేవిధంగా ఎగుమతుల రంగంలో చైనా అభివృద్ధి బాగా క్షీణించిందని, ఆర్థిక అభివృద్ధి సూచికలో నాలుగు స్థానాలు దిగజారిపోయిందని తెలిపింది. చైనా రానున్న దశకంలో అభివృద్ధి రేటు 4.4 శాతంగా పేర్కొంది. వివిధ దేశాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, వాణిజ్య విపణిలో ఆయా దేశాల ప్రస్తుత శక్తి సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకుని హార్వార్డ్ బృందం తన నివేదికను తయారు చేసింది.