అంతర్జాతీయం

తీవ్ర పరిణామాలు తప్పవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వార్సా, జూలై 6: ఉత్తర కొరియా సైనికపరంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతుండడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉత్తర కొరియా దుందుడుకు చర్యలకు తీవ్ర పరిణామాలు ఉంటాయనే విషయాన్ని అది గ్రహించేలా చేయాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. అంతేకాదు, ఉత్తరకొరియా చర్యలకు తీవ్రస్తాయిలో స్పందించే విషయాన్ని తాను పరిశీలిస్తున్నట్లు కూడా ఆయన హెచ్చరించారు. ‘ప్రపంచానికే ముప్పుగా పరిణమించిన దీనితో తలపడాలని, చండాలమైన వారి ప్రవర్తనకు తీవ్ర పరిణామాలు ఉంటాయనే విషయాన్ని ఉత్తర కొరియాకు తెలిసి వచ్చేలా చేయాలని ప్రపంచ దేశాలకు నేను పిలుపునిస్తున్నాను’ అని ఐరోపా పర్యటనలో భాగంగా వార్సాను సందర్శించిన సందర్భంగా ట్రంప్ అన్నారు. ఉత్తర కొరియాపై తాము తీసుకోవాలని ఆలోచిస్తున్న చర్యల్లో చాలా తీవ్రమైనవి కూడా ఉన్నాయని అన్నారు. ఉత్తర కొరియా పట్ల చైనా వైఖరితో విసిగిపోయిన ట్రంప్ ప్రభుత్వం ఆ ఉత్తర కొరియాకు నిధులు లభించకుండా చేయడానికి సరికొత్త ఆంక్షలు విధించాలని యోచిస్తోంది. ఉత్తర కొరియా ఆర్థిక కార్యకలాపాలు సాఫీగా సాగిపోయేలా చూస్తున్న చైనా కంపెనీలపై ఆంక్షలు విధించడం కూడా ట్రంప్ ప్రభుత్వం తీసుకోదలచిన చర్యల్లో ఉన్నాయి. గతంలో ఇరాన్ విషయంలో అమెరికా తీసుకున్న ఇలాంటి చర్యలు సత్ఫలితాలిచ్చి ఇరాన్ చర్చలకు అంగీకరించేలా చేశాయి. అయితే ఈ చర్యలు చైనా ప్రభుత్వంతో దౌత్యపరంగా కొత్త వివాదానికి తెరతీసే ప్రమాదమూ లేకపోలేదు.

చిత్రం.. పోలండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ దూదతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్