అంతర్జాతీయం

భారత యుద్ధవీరులకు శ్రద్ధాంజలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైఫా, జూలై 6: ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన భారతీయ సైనికులకు శ్రద్ధాంజలి ఘటించారు. హైఫా నగరంలోని ఇండియన్ సిమ్మెట్రీని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమీన్ నెతనాహ్యూతో కలిసి మోదీ సందర్శించారు. మోదీ ఆఖరి రోజు పర్యటనలో భారత అమరజవాన్లకు ఘన నివాళులర్పించారు. హైఫా నగరంలో యుద్ధ వీరులకు ప్రధాని శ్రద్ధాంజలి ఘటించి, వారి సేవలను కీర్తించారని విదేశీ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లే తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మేజర్ దల్‌పత్‌సింగ్ స్మారకార్థం ఓ శిలాపలకాన్ని మోదీ ఆవిష్కరించారని అన్నారు. హైఫా నగర విముక్తిపోరాటంలో ప్రాణాలు కోల్పోయిన సింగ్‌ను ‘హిరో ఆఫ్ హైపా’గా పేర్కొంటారు. ‘మొదటి ప్రపంచ యుద్ధంలో హైఫా విముక్తికి భారతీయ సైనికులు చేసిన త్యాగాలు మరువలేం. మీ ధైర్యసాహసం, అంకితభావం ఇరుదేశాల మైత్రికి ఎంతో దోహపడుతోంది’ అని మోదీ గెస్ట్ బుక్‌లో రాశారు.