అంతర్జాతీయం

ప్రవాసం సమ్మోహనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెల్ అవీవ్, జూలై 6: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌లో జరిపిన పర్యటన ఇక్కడ భారతీయుల్లో ఎనలేని ఆనందాన్ని కలిగించింది. తాము అనుకున్నదానికంటే ఎక్కువగానే నరేంద్ర మోదీ తమ ఇబ్బందుల గురించి తెలుసుకున్నారని, వాటిలో కొన్నింటిని పరిష్కరించారంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా యూదుల్లో ఈ ఆనందం మరింతగా కనిపించింది. భారత్‌లోనే తమ మూలాలు ఉన్నందుకు ఎంతగానో గర్విస్తున్నామని ఇక్కడ భారతీయులు అంటున్నారు. ఒక్క ఇజ్రాయెల్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఉంటున్న భారతీయ సంతతి ప్రజల సాదకబాధకాలను తెలుసుకుంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు మోదీ చేస్తున్న ప్రయత్నం తమను ఎంతగానో ప్రభావితం చేస్తోందని భారతీయులు చెబుతున్నారు. ప్రధానిగా మోదీ తీసుకుంటున్న నిర్ణయాలు ఇతర దేశాల్లో ఉన్న భారతీయులు అందరికీ గర్వకారణంగా ఉంటున్నాయని మాతృదేహానికి తాము దూరంగా ఉన్నా తమ రక్షణ, భద్రతకు ఎలాంటి దిగులూ ఉండదన్న నమ్మకం తమలో కలుగుతోందని ఇక్కడి భారతీయులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోని భారతీయులు మమేకం కావడమే కాకుండా వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తున్నారని, ఇజ్రాయెల్‌లో ఉంటున్న భారతీయులకు కూడా ఇదే రకమైన ధీమా కలిగించిందని యోనా మాలికర్ అనే భారతీయ సంతతి పౌరుడు తెలిపారు.
నాగ్‌పూర్‌కు చెందిన 33 ఏళ్ల మాలికర్ ఇజ్రాయెల్‌లోని సియోనికి వలసవెళ్లారు. ప్రవాస భారతీయులతో మాట్లాడిన సందర్భంగా వారి గురించి మోదీ చేసిన వ్యాఖ్యలు మాతృదేశంలో వారికున్న అనుబంధాన్ని వివరిస్తూ అన్న మాటలు తమలో కొత్త స్ఫూర్తిని ఇచ్చాయని అన్నారు. ఇక్కడ భారతీయులందరూ ఇదంతా తమ గురించేనా అన్నట్టుగా మోదీ ఎన్నో ఉదంతాలను తన ప్రసంగంలో ఉటంకించడం మరింత ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. అలాగే హెబ్రూ వర్శిటీలో చదువుతున్న బిహార్ పౌరుడు కూడా మోదీ ప్రసంగం ఇక్కడ ఉంటున్న భారతీయ విద్యార్థులకు కొత్త ఉత్తేజాన్ని అందించిందని తెలిపాడు. ముఖ్యంగా భారత్‌కు చెందిన విదేశీ పౌరులకు ఓసిఐ కార్డులను ఇవ్వడం తమకు మోదీ అందించిన వరంగా ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు.
ఇక్కడ ఉంటున్న భారతీయ సంతతికి చెందిన ప్రతి ఒక్కరి హృదయాలను దోచుకునేలా ఎవర్నీ నిరుత్సాహ పరచని రీతిలో మోదీ మాట్లాడారని కోల్‌కతాకు చెందిన సైబిల్ ఎజెకిల్ అన్నారు. 1970లోనే తాను ఇజ్రాయెల్ వచ్చేశానని తెలిపారు. భారతీయులు ఎక్కడ ఉన్నా మాతృదేశంలో తమకున్న అనుబంధాన్ని విడనాడకూడదంటూ మోదీ చేసిని వ్యాఖ్యలు ఇక్కడ భారత సంతతి ప్రజలను మరింతగా ఆకర్షించాయి.

చిత్రం.. టెల్‌అవీవ్‌లో బుధవారం రాత్రి జరిగిన సభలో ప్రవాస భారతీయులకు అభివాదం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ