అంతర్జాతీయం

ఢిల్లీ టు వాషింగ్టన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 7: ప్రపంచంలోనే అత్యంత పెద్దవైన రెండు ప్రజాస్వామ్య దేశాలను అనుసంధానిస్తూ భారత రాజధాని న్యూఢిల్లీ నుంచి అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసికి తొలిసారి నేరుగా ప్రారంభించిన ఎయిండియా విమాన సర్వీసు (ఎఐ-103) డల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. దీనిలో ప్రయాణించిన వారిలో అమెరికాలో భారత రాయబారిగా పనిచేస్తున్న నవ్‌తేజ్ సర్నా, ఎయిరిండియా చైర్మన్, ఎండి అశ్వనీ లోహానీ, కమర్షియల్ డైరెక్టర్ పంకజ్ శ్రీవాస్తవ తదితర ప్రముఖులు ఉన్నారు. అమెరికాకు నేరుగా ప్రారంభించిన ఈ సర్వీసు ద్వారా ప్రయాణికులకు సేవలు అందించేందుకు 238 సీట్లు ఉన్న బోయింగ్ 777-200 ఎల్‌ఆర్ విమానాన్ని ఎయిరిండియా రంగంలోకి దింపింది. ఈ విమానంలోని మొత్తం సీట్లలో ఎనిమిది ఫస్ట్ క్లాస్ సీట్లు, 35 బిజినెస్ క్లాస్ సీట్లు, 195 ఎకానమీ క్లాస్ సీట్లు ఉన్నాయి. కాగా, ఈ మార్గంలో ఈ నెల 9వ తేదీ నుంచి మరింత పెద్దదైన బోయింగ్ 777-300 ఇఆర్ విమానాన్ని నడుపుతామని, దీనిలో మొత్తం 321 సీట్లు ఉంటాయని ఎయిరిండియా అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. వారానికి మూడుసార్లు నడిచే ఈ విమానం వాషింగ్టన్‌తో పాటు న్యూయార్క్, న్యూఆర్క్, చికాగో, శాన్‌ఫ్రాన్సిస్కో నగరాలకు కూడా వెళ్తుంది.