అంతర్జాతీయం

వెల్లువెత్తిన నిరసనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంబర్గ్, జూలై 7: జి-20 పారిశ్రామిక దేశాల శిఖరాగ్ర సదస్సుకు నిరసనగా శుక్రవారం జర్మనీ పట్టణమైన హాంబర్గ్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. ఒక దశలో విధ్వంసకాండకు దారితీశాయి. మొత్తం హాంబర్గ్ పట్టణమంతా కూడా నిరసనకారుల ఆందోళనలతో స్తంభించిపోయింది. పట్టణంలో నివసిస్తున్న ఎవరూ కూడా బయటకు రాలేని పరిస్థితి తలెత్తింది. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు నీటిగోళాలను ప్రయోగించారు. ఈ సందర్భంగా జరిగిన దాడులు, అల్లర్లలో 76మంది అధికారులు గాయపడ్డారు. వీరిలో ఐదుగురిని ఆసుపత్రిలో చేర్చారు. ఆందోళనకారులతో పోలీసులు ఘర్షణకు దిగిన దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని చానళ్లలోనూ హోరెత్తిపోయాయి. ‘జి-20 వెలకమ్ టు హెల్’ అనే నినాదంతో ఆందోళనకారులు తీవ్ర స్థాయిలోనే ప్రదర్శనలు జరిపారు. వివిధ లక్ష్యాలతో దాదాపు లక్షమంది హాంబర్గ్ పట్టణం చేరుకుని సంపన్న దేశాల తీరుతెన్నుల పట్ల నిరసనలు వ్యక్తం చేశారు. అల్లర్లను అదుపుచేయడానికి దాదాపు 20వేలమంది పోలీసులను రంగంలోకి దించారు. ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్, టర్కీ అధ్యక్షుడు తయ్యిబ్ ఎరడోగిల్ తదితరులు హాజరవుతున్నారు. అంతర్జాతీయ యుద్ధాలు, ఉగ్రవాదం, శరణార్థ సంక్షోభం, వాతావరణ మార్పులు తదితర సవాళ్లపై ప్రపంచ దేశాలు ఎంతమాత్రం దృష్టి సారించడం లేదంటూ ఆందోళనకారులు కనె్నర్ర చేశారు. అనేకచోట్ల వాహనాలనూ ధ్వంసం చేయడం లేదా దగ్ధం చేశారు. పోలీసులపై దాడులకూ పాల్పడ్డారు.
చిక్కుకుపోయిన మిలానియా ట్రంప్
జి-20 దేశాల శిఖరాగ్ర సదస్సుకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనలు తీవ్రం కావడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భార్య మిలానియా ట్రంప్ బయటకు రాలేక హాంబర్గ్‌లోని ఓ గెస్ట్‌హౌస్‌లో చిక్కుకుపోయారు. సదస్సుకు హాజరవుతున్న వివిధ దేశాల అధినేతల భార్యలకు సంబంధించిన కార్యక్రమాలను ఈ నిరసనల కారణంగా కుదించివేయాల్సి వచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి. అతిథి గృహం నుంచి బయటకు రావడానికి మిలానియా ట్రంప్‌కు పోలీసులు అనుమతి ఇవ్వలేదని ట్రంప్ ప్రతినిధి స్ట్ఫోనీ గ్రిషామ్ తెలిపారు. గెస్ట్‌హౌస్‌లో చిక్కుకుపోవడం వల్ల హాంబర్గ్‌లోని హార్బర్‌ను కూడా ఆమె సందర్శించలేకపోయారు.

చిత్రాలు.. జి-20 పారిశ్రామిక దేశాల శిఖరాగ్ర సదస్సును నిరసిస్తూ హాంబర్గ్‌లో వేలాదిమంది వీధులకెక్కారు. నిరసనకారులు విధ్వంసానికి దిగడంతో లాఠీచార్జి జరిపారు. నీటిగోళాన్ని ప్రయోగించినా కదలకుండా ఉన్న ఓ మహిళ.