అంతర్జాతీయం

ఎన్నో మాట్లాడుకున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంబర్గ్, జూలై 7: అమెరికా, రష్యాలు మరింత సన్నిహితంగా పనిచేయడానికి అన్నివిధాలా అనుకూల పరిస్థితులు ఉన్నాయని అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ అన్నారు. జి-20 శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఆయన సమావేశమయ్యారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పటినుంచి చెలరేగిన వివాదాల నేపథ్యంలో ఇరు దేశాల అధ్యక్షులు కలుసుకోవడం ఇదే మొదటిసారి. పుతిన్‌తో కలిసి కూర్చోవడం తనకెంతో గౌరవంగా ఉందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వీరిద్దరి సమావేశాన్ని వీక్షించేందుకు పాత్రికేయులను స్వల్ప వ్యవధిపాటు అనుమతించారు. ఇప్పటికే పుతిన్‌తో తాను ఎంతో అర్థవంతమైన చర్చలు జరిపానని, ఇరు దేశాలకు పనికొచ్చే విధంగా తామిద్దరూ కలిసి పనిచేయడానికి ఎంతో అనుకూల వాతావరణం ఉందని అన్నారు. ఈ రెండు దేశాలూ కలిస్తే సంబంధిత దేశాలన్నింటికే కాకుండా మొత్తం ప్రపంచానికే ఎంతో మేలు జరుగుతుందన్నారు. అయితే ఈ సమావేశంలో తామిద్దరి మధ్య జరిగిన చర్చల గురించి వివరించడానికి ట్రంప్ నిరాకరించారు. కేవలం ‘చాలా విషయాలు మాట్లాడుకున్నాం’ అని మాత్రమే ముక్తసరిగా జవాబిచ్చారు. పుతిన్ కూడా ట్రంప్ తరహాలోనే దాటవేత ధోరణినే అవలంబించారు. అంతర్జాతీయ సమస్యలను, ద్వైపాక్షిక అంశాలను చర్చించామన్నారు. అయితే తమమధ్య సమావేశం జరగడమే ఓ సానుకూల సంకేతమని, దీనివల్ల సానుకూల ఫలితాలు వస్తాయనే ఆశిస్తున్నామని తెలిపారు.

చిత్రం.. హాంబర్గ్‌లో భేటీ అయన రష్యా, అమెరికా అధినేతలు పుతిన్, ట్రంప్