అంతర్జాతీయం

ఉగ్రవాదం పీచమణచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంబర్గ్, జూలై 7: ఉగ్రవాదంపై యుద్ధానికి బ్రిక్స్ దేశాధినేతలు కలిసి రావాలని మోదీ పిలుపునిచ్చారు. ఉగ్రవాదం అంతానికి, బ్రిక్స్ దేశాల ఆర్థికాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. జి-20 దేశాల సమావేశానికి హాజరయ్యేందుకు ఇక్కడకు వచ్చిన ప్రధాని మోదీ బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) దేశాధినేతలతో జరిగిన అనధికారిక సమావేశంలో మాట్లాడారు. ఉగ్రవాదం నిర్మూలన, ప్రపంచ ఆర్థిక గమనాన్ని శాసించగల స్థాయిలో బ్రిక్స్ దేశాలున్నాయని అన్నారు. ఈ దిశగా బ్రిక్స్ దేశాధినేతలు దృఢమైన న్యాయకత్వ పటిమను ప్రదర్శించాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించడానికి జి-20 దేశాలు ఉగ్ర మూలాలను, ఆర్థిక మార్గాలను, వారికి మద్దతునిస్తున్న సంస్థలు, సహాయసహకారాలందిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని అన్నారు. అందుకు బ్రిక్స్ దేశాధినేతలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. విశ్వ విపణిలో వాణిజ్యం, మేధా సంపత్తిని ఇచ్చిపుచ్చుకోవడంలో ఎటువంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించేందుకు కృషి చేయాలని అన్నారు. గల్ఫ్, పశ్చిమాసియా, కొరియా ద్వీపకల్పంలో దిగజారిపోతున్న పరిస్థితులపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ వేదికపై ప్రగతి, సుస్థిరత, సంస్కరణల ప్రాముఖ్యతను బ్రిక్స్ దేశాలు గొంతెత్తి చాటాలని అన్నారు. నేడు ప్రపంచంలో ఆర్థిక, రాజకీయ, శాంతి భద్రతల విషయంలో చోటుచేసుకుంటున్న విపరిణామాలు అందరినీ కలవరపెడుతున్నాయని చెప్పారు. అంతర్యుద్ధంతో నలిగిపోతున్న అఫ్గానిస్తాన్, ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య చెలరేగుతున్న వివాదం, సిరియాలో ఐసిస్ ఉగ్రవాదుల ఆగడాలు, లిబియా, యెమెన్‌లలో జరుగుతున్న తిరుగుబాట్లు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీనికితోడు ఉగ్రవాదానికి ఊతమిస్తోందంటూ ఖతర్‌తో సౌదీ అరేబియా, యుఏఈ, బెహ్రెయిన్ దేశాలు సంబంధాలు తెగతెంపులు చేసుకోవడం బ్రిక్స్ దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నదని అన్నారు. బ్రిక్స్ దేశాధినేతల మధ్య జరిగిన ఈ అనధికారిక సమావేశం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు జరిగింది. అదీ భారత్, చైనా దేశాల మధ్య సిక్కిం సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్న తరుణంలో ఈ సమావేశం చైనా అధ్యక్షుడి ఆహ్వానం మేరకు జరగడం, అందులో ప్రధాని మోదీ మాట్లాడడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

చిత్రం.. హాంబర్గ్‌లో శుక్రవారం జరిగిన బ్రిక్స్ దేశాధినేతల అనధికార సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ