అంతర్జాతీయం

అణ్వస్త్రాల నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, జూలై 8: అణ్వస్త్రాలను నిషేధించడానికి ఉద్దేశించిన మొట్టమొదటి అంతర్జాతీయ ఒప్పందానికి ఐక్యరాజ్య సమితిలోని 120కి పైగా సభ్యదేశాలు ఆమోదం తెలిపాయి. అయితే భారత్‌తో పాటుగా అమెరికా, చైనా, పాకిస్తాన్‌లాంటి పలు అణ్వస్త్ర దేశాలు నిషేధానికి ఉద్దేశించిన చట్టబద్ధ ఒడంబడికపై జరిగిన చర్చలను బహిష్కరించాయి. అణ్వస్త్రాలను బహిష్కరించడానికి ఉద్దేశించిన ఈ ఒడంబడికపై గత ఇరవై ఏళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. కాగా, ఈ తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితిలో సభ్యుల కరతాళ ధ్వనుల మధ్య ఆమోదించారు. తీర్మానానికి అనుకూలంగా 122 దేశాలు ఓటు వేయగా, ఒక్క దేశం (నెదర్లాండ్) మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేసింది. కాగా, సింగపూర్ ఓటింగ్‌కు గైరుహాజరయింది.
కాగా, భారత్‌తో పాటుగా ఇతర అణ్వస్త్ర దేశాలయిన అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ప్రాన్స్, పాకిస్తాన్,
ఉత్తర కొరియా, ఇజ్రాయెల్‌లు ఈ ఒడంబడికపై జరిగిన చర్చల్లో పాలు పంచుకోలేదు. అణ్వస్త్రాలను నిషేధించడానికి ఉద్దేశించిన, దేశాలు చట్టబద్ధంగా కట్టుబడి ఉండే ఈ తీర్మానాన్ని ఆమోదించడంపై చర్చలు జరపడం కోసం ఈ ఏడాది మార్చిలో ఐరాసలో ఒక ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ తీర్మానంపై చర్చలు జరపడానికి ఒక సమావేశం ఏర్పాటు చేయాలంటూ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రతిపాదించిన తీర్మానంపై గత ఏడాది అక్టోబర్‌లో 120కి పైగా దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. ఆ సందర్భంలోను భారత్ ఓటింగ్‌కు హాజరు కాలేదు. అణు నిరాయుధీకరణ కోసం ఒక సమగ్రమైన ఒడంబడికకోసం ప్రపంచ దేశాలు దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నాయని, అయితే ప్రతిపాదిత సమావేశం ఈ ఆకాంక్షను నెరవేరుస్తుందని తాము భావించడం లేదని ఓటింగ్‌కు గైరుహాజరుపై ఇచ్చిన వివరణ (ఇఓఎం)లో భారత్ పేర్కొనింది. అంతేకాదు జెనీవాలో జరిగిన సమావేశం ఒక్కటే నిరాయుధీకరణపై జరిగిన నిజమైన బహుళ జాతి చర్చల వేదిక అని తాము భావిస్తున్నట్లు కూడా భారత్ స్పష్టం చేసింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా అణ్వస్త్రాల నిర్మూలనకు అంతర్జాతీయ వెరిఫికేషన్ తప్పనిసరని అంటూ, ప్రస్తుత ప్రక్రియలో వెరిఫికేషన్ అంశాన్ని చేర్చలేదని కూడా మన దేశం స్పష్టం చేసింది.
కాగా, సెప్టెంబర్‌లో అన్ని దేశాలు సంతకం చేయడానికి ప్రస్తుత ఒడంబడికను ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో తెరిచి ఉంచుతారు. కనీసం 50 దేశాలు దీనికి ఆమోదముద్ర వేసిన 90 రోజుల తర్వాత ఇది అమలులోకి వస్తుంది. కాగా, ఈ ఒడంబడికపై జరిగిన చర్చల్లో తాము పాలు పంచుకోలేదని, దీనిపై సంతకం చేయాలని కానీ, ఆమోదముద్ర వేయాలని కానీ, చివరికి దీనిలో ఒక పార్టీ కావాలని కానీ తాము అనుకోవడం లేదని, ఎందుకంటే ఈ ఒడంబడిక అంతర్జాతీయ భద్రతా వాతావరణంపై వాస్తవ పరిస్థితులను గుర్తించడం లేదని, భద్రతా మండలిలో వీటో అధికారం ఉన్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు ఒక సంయుక్త ప్రకటనలో స్పష్టం చేశాయి.

చిత్రం.. ఐరాస సదస్సులో అణ్వస్త్రాల నిషేధ తీర్మానాన్ని ఆమోదిస్తూ చప్పట్లు కొడుతున్న వివిధ దేశాల ప్రతినిధులు