అంతర్జాతీయం

జాగ్రత్తలు తీసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జూలై 8: భారత్‌లో పర్యటించే చైనా పౌరులు వ్యక్తిగత భద్రతకు కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ సూచించింది. అయితే ఇది కేవలం సూచన మాత్రమేనని హెచ్చరిక కాదని పేర్కొంది. భారత్‌లో పర్యటించే చైనీయులు అక్కడ నెలకొని ఉన్న పరిస్థితులు, వ్యక్తిగత భద్రత విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. న్యూఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం నుంచి శనివారం ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది. భారత్‌లో స్థానిక స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించి వ్యక్తిగత భద్రతతోపాటు తగుజాగ్రత్తలు తీసుకోవాలని తమ దేశ పౌరులను కోరింది. తాము ఏయే ప్రాంతాల్లో పర్యటించనుంది, పర్యటన వివరాలను స్నేహితులు, బంధువులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాల్సిందిగా తెలిపింది. పర్యటిస్తున్నప్పుడు వ్యక్తిగత గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని, భారత్‌లోని ఆచార వ్యవహాల విషయంలో జాగ్రత్తగా మెలగాలని, అక్కడి చట్టాలు, మతసంబంధ విషయాల్లో చాలాజాగ్రత్తగా ఉండాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించేందుకు తమ దేశ కాన్సులర్ కార్యాలయ ఫోన్ నంబర్లను కూడా ఆ ప్రకటనలో వెల్లడించింది. అవసరం లేని పర్యటనలను రద్దు చేసుకోవడం మేలని తమ పౌరులకు చైనా సూచించింది. సిక్కిం సరిహద్దులోని డోక్లామ్ వద్ద గత మూడు వారాలుగా నెలకొని ఉన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా చైనా తాజాగా ఈ మేరకు భారత్‌లో పర్యటిస్తున్న తమ దేశ పౌరులకు జాగ్రత్తలు జారీ చేసింది.