అంతర్జాతీయం

మీ ఊహకే వదిలేస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంబర్గ్, జూలై 8: జి-20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా హాంబర్గ్‌లో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అనేక అంశాలను చర్చించారంటూ తాము చేసిన ప్రకటనను వివరించడానికి భారత్ నిరాకరించింది. సిక్కిం సెక్టార్‌లో ఇరు దేశాల సైన్యాల మధ్య ఉద్రిక్తత నెలకొని ఉన్న తరుణంలో ఈ సమావేశం జరగడం తెలిసిందే. జి-20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా మోదీతో జిన్‌పింగ్ సమావేశమయ్యే వాతావరణం లేదంటూ చైనా ప్రకటన చేసిన 24 గంటలకే ఈ ఇరువురు నేతలు సమావేశమై కొద్దిసేపు చర్చలు జరుపుకోవడం తెలిసిందే. కాగా, ఇరువురు నేతలు అనేక అంశాలను చర్చించారని విదేశాంగ శాఖ ఒక ట్వీట్‌లో పేర్కొనడమే తప్ప ఏ విషయాలు చర్చించారనే విషయం స్పష్టంగా చెప్పలేదు.
కాగా, ఈ అంశంపై శనివారం మీడియా ప్రతినిధులు విదేశాంగ శాఖ ప్రతినిధి గోపాల్ బాగ్లేను నొక్కి నొక్కి ప్రశ్నించినప్పటికీ ఆయన ఎలాంటి వివరణా ఇవ్వలేదు. ‘అంతేకాదు అనేక అంశాలు అంటే అనేక అంశాలే. దీనికి మించి నేను ఏమీ చెప్పదలచుకోలేదు.. మీ నిర్ణయాలకే దాన్ని వదిలేస్తున్నాను’ అని ఆయన అన్నారు. అంతేకాదు ఇరువురు నేతలు చిరునవ్వులు చిందిస్తున్న ఫోటో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత తగ్గుదలకు గుర్తా అని విలేఖరులు అడిగినప్పుడు ఆయన ‘ఒక ఫోటో వెయ్యి మాటలకన్నా ఎక్కువ చెప్తుంది’ అన్న పాతకాలం నాటి సామెతను గుర్తు చేశారు.